విశాఖ నార్త్‌లో గంటాకు బ్రహ్మరథం
- 14 Views
- admin
- March 27, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
హారతులుతో స్వాగతం పలుకుతున్న మహిళలు—————-
ఉత్తరాన్ని మోడల్ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతా: ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్ధి గంటా—————–
33, 34 వార్డుల్లో టీడీపీలోకి భారీగా చేరికలు—————
గంటాకు ఆర్యవైశ్య సంఘం మద్దతు——————
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : ఉత్తర నియోజక వర్గంలో టీడీపీ అభ్యర్ధి గంటా శ్రీనివాసరావుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచార రథం పై వెల్తున్న ఆయనపై పూల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కడికక్క మహిళలలు హారతులుతో స్వాగతం పలుకుతున్నారు. డప్పు వాయిద్యాలతో ఊరిగింపుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. నియోజక వర్గంలోని అన్ని వార్డుల్లోనూ ఇదే పరిస్థితి కనబడుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గంటా 13, 33, 34 వార్డు ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్ధి శ్రీ భరత్ తో కలిసి ప్రచారం సాగిస్తున్న ఆయనకు పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొంటున్నారు. మీ వెంట మేమున్నామంటూ నడుస్తున్నారు. జై గంటా…జై జై గంటా అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ సంధర్బంగా గంటా మాట్లాడుతూ రాష్ట్రానికి అద్భుతమైన పాలన అందించి అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంటే జగన్మోహన్రెడ్డి మాత్రం కేసుల ఊబిలో ఇరుక్కొని కోర్టులు చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేసారు. చక్కని పాలన అందిస్తున్న చంద్రబాబు కావాలో కేసుల ఊభిలో ఇరుక్కున్న జగన్ కావాలో ఓటర్లు ఆలోచించి ఓట్లును వేయాలని అభ్యర్ధించారు. గంటా ప్రచారానికి మద్దతుగా వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గంటా లాంటి నేతను ఎప్పుడు నుంచో కోరుకుంటున్నామని ఆయనపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా గంటా ప్రతి ఒక్కరిని కలుస్తూ నియోజక అభివృద్దికి కట్టుబడి పని చేస్తానని ఉత్తరాన్ని మోడల్ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానని మాటస్తున్నారు. మీ అభిమానాన్ని మరువలేనని చిరునవ్వుతో ఆప్యాయంగా సాగుతున్నారు. జగన్ కు రాజకీయ అవగాహన లేదని ఇంకా ట్రైనింగ్ పిరీడ్ లో వున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు లోటు చెయ్యలేదని చెప్పారు. ఉత్తర నియోజకవర్గ పరిధి చిన్నదైనా సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. గత 15 ఏళ్లుగా ఇక్కడ టిడిపి ప్రాతినిధ్యం లేకపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని త్వరలోనే వాటన్నింటనీ తీర్చుతానని హామీ ఇచ్చారు.
రాష్ట్ర భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకమైనవని ఈ విషయాన్ని ఓటర్లంతా గుర్తుంచుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని లోక్ సభ, అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని గంటా ధీమా వ్యక్తం చేశారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ప్రచారంలో టిడిపి సీనియర్ నాయకుడు ఫీచర్స్ ఇండియా ఎండీ భరణి కానరామారావు, నియోజక వర్గ ఎన్నికల పరిశీలకుడు గద్దె బాబూరావు, కాశీ విశ్వనాథం, లొడగల కష్ణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీి ఇమంది వెంకటరమణ, నమ్మి రవికుమార్ , శీతల రవణమ్మ పెద్ద సంఖ్యలో మహిళ నేతలు ,వార్డు అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో యువకులు స్థానికులు పాల్గొన్నారు.
గంటాకు ఆర్యవైశ్య సంఘం మద్దతు: ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు జీవీఎంసీ 33 వ వార్డు తాడిచెట్లపాలెం రైల్వే న్యూ కాలనీ కి చెందిన శ్రీ వాసవి మాత ఆర్యవైశ్య సేవా సంఘం తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టిడిపి నేత కాళిదాసు ఆధ్వర్యంలో టీడీపీకి మద్దతు తెలిపిన సంఘం సభ్యులకు గంటా పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వారి సర్వతోముఖాభివద్ధికి తోడ్పడ్డాయన్నారు.
33, 34వ వార్డులో టీడీపీలోకి భారీ వలసలు:
ఉత్తర నియోజకవర్గ పరిధి జీవీఎంసీ 34వ వార్డులోని చిట్టిబాబు కాలనీ, రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన 180 కుటుంబాలు టీడీపీలో చేరారు. వీరందరినీ గంటా కండువాలతో పార్టీలోకి ఆహ్వానించారు. నియోజక వర్గ అభివృద్దికి కృషి చేస్తానని మీకు ఏ సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటానని వారికి హామీ ఇచ్చారు. అలాగే 33 వార్డు పరిధి లో ఉన్న వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ కి చెందిన వారు పెద్ద సంఖ్యలో గంటా సమక్షంలో టీడీపీ తీర్దం పుచ్చుకున్నారు. 33వ వార్డు కు చెందిన ఆటో రిక్షా కార్మిక సంఘం సభ్యులు తో పాటు నందగిరి నగర్ కు చెందిన భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు, తోపుడుబండ్ల సంఘానికి చెందినవారు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో రిక్షా, తాపీ మేస్త్రి, తోపుడుబండ్ల కార్మికుల సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు.


