సింహాద్రి ఎన్టీపీసీ పని తీరుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్
- 12 Views
- admin
- March 28, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
పరవాడ, ఫీచర్స్ ఇండియా : సింహాద్రి ఎన్టీపీసీ సంబంధించి సామర్థ్యం, కరంట్ ఏయే రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది, బోగ్గు ఎక్కడి నుండి దిగుమతి చేయబడుతుంది, సిఎస్ఆర్ నిధులు ద్వారా పరిసర గ్రామాలలో అభివద్ధి పనులు ఎంతవరకు చేశామన్న దానిపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. గురువారం దీపాంజలి నగర్ లో ఉన్న సాముద్రిక హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిజిఎం ఎఆర్ మైతీ ముఖ్యతిథిగా పాల్గొని మాట్లాడుతూ సింహాద్రి ఎన్టీపీసీ లో నాలుగు యూనిట్లు నుండి రెండు వేల మెగావాట్లు సామర్థ్యం కలిగి ఉందని అన్నారు. అలాగే ఆంద్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, కర్ణాటక వంటి రాష్ట్రాలకు పవర్ అందిస్తుందని అన్నారు. కోల్ కూడా ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటుమన్నారు. సిఎస్ఆర్ నిధులు ద్వారా చుట్టుపక్కల గ్రామాలను ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. గ్రామాల్లో ఇప్పటి వరకూ జరిగిన అభివద్ధి పనులపై పవర్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓ అండ్ ఎమ్ జిఎమ్ ఏసీ సాహు, టిఎస్ జిఎమ్ ఎస్పి సింగ్, టిిఎస్ మేనేజర్ పి.సుందరి, ఏజీఎం శివప్రసాద్, పిఆర్ఓ మల్లయ్య పాల్గొన్నారు.


