సార్వత్రిక ఎన్నికలకు మోడల్ పోలింగ్ కేంద్రాలు
- 11 Views
- admin
- March 28, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
విజయనగరం, ఫీచర్స్ ఇండియా : సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు. గురువారం విజయనగరం మండలంలోని మలిచేర్ల గ్రామ పంచాయతి పరిదిలో ఉన్న సుంకరిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు అరవింద కుమార్ వర్మ, పి.టి. సాధుతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మోడల్ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన త్రాగునీరు, మహిళలకు, పురుషులకు వేరుగా మరుగుదొడ్లు నిర్మాణాలు, పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లు ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ అధికారులకు కేటాయించిన నాలుగు సీట్లు, ప్రొసిడింగ్ అధికారి సీట్, పోలింగ్ ఏజెంట్లుకు ఏర్పాటు చేసిన ఆరు సీట్లు, లోక్ సభ, అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన ఇవియంలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ప్రధమ చికిత్సకు అవసరమైన మెడికల్ కిట్స్, శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. పలు ఏర్పాట్లుఫై ఆరాతీసి లోటుపాట్లుఫై చర్చించి పలు రకాలైన సూచనలు చేసారు. ఎన్నికల పరిశీలకులకు పోలింగ్ కేంద్రంలోని ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఓటర్లుకు పోలింగ్ కేంద్ర ఆవరణలో నీడ ఉండేవిధంగా షామియానాలు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఓటర్లుకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. విభిన్న ప్రతిభా వంతులకు, వ ద్దులకు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వీల్ చైర్ ఏర్పాటు చేయాలని, వోటింగ్ శాతాన్ని పెంచడానికి బిఎల్ఓలు కషి చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ కే. వెంకట రమణారెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారిని జె. విజయలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కే. సునీల్ రాజ్ కుమార్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


