ఒక్క అవకాశం ఇవ్వండి ధన రాజకీయాలను తిప్పికొడదాం
- 8 Views
- admin
- March 29, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
విజయనగరం, ఫీచర్స్ ఇండియా : విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి ఓటరు తమ ఓటును ఈలగుర్తుపై వేసి తనను గెలిపించడానికి ఒక్క అవకాశం ఇవ్వాలని, డా.జె.పి.మద్దతుతో అందుకే పోటీ చేస్తున్నానని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్ధి భీశెట్టి బాబ్జీ అన్నారు. పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. రైల్వేస్టేషన్, అలకానందకాలనీ, వివేకానందకాలనీలలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తూ గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రజల సమస్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏమీ స్పందించకపోయినా తాము ప్రజలకు అండగా ఉన్నామని అందుకే ప్రజలు ఈసారి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఎవ్వరూ గెలిచినా ప్రజలు ఓడినట్లేనని అందుకే ప్రజలు మనసుపెట్టి తనను గెలిపించాలన్నారు. పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు అల్లంశెట్టి నాగభూషణం మాట్లాడుతూ విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక కార్యకర్త, సామాన్యుడు ప్రజలందరితో కలిసిమెలిసి తిరిగేటి వ్యక్తి భీశెట్టి బాబ్జీ మాత్రమేనని నియోజకవర్గంలోని పోటీ చెయ్యని రాజకీయపార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తప్పనిసరిగా ప్రతి కుటుంబం నుండి ఒక్క ఓటు వెయ్యగలిగితే భీశెట్టి విజయం ఎంతో సులువుగా ఉంటుందని ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో ఈల గుర్తుపై ఓటు వేసి భీశెట్టికి మద్దతు పలకాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పిఎల్ఎన్ రాజు, నిమ్మ శ్రీను, ఆదిబాబు, శ్రీను, భాస్కర్, చిన్నారావు, రమేష్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.


