తెలుగుదేశం గెలుపు దేశానికే మలుపు
- 12 Views
- admin
- March 29, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
నేరగాళ్ల పార్టీ వైసీపీని చిత్తుగా ఓడించండి———————
బీజేపీ, టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడేది లేదు————————-
ఆనంద ఆంధ్రప్రదేశ్ ముందున్న లక్ష్యం ——————–
రాష్ట్రంలో, దేశంలో సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీఆర్———–
నేతలతో టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి———————
అమరావతి, ఫీచర్స్ ఇండియా: ”వైసీపీ నేతల ఫ్రస్టేషన్ పీక్కు వెళ్లింది. గాజువాకలో గర్భిణిపై వైసీపీ నేతల దాడి అమానుషం. వైకాపా అరాచకాలను అందరూ ఖండించాలి. నేరగాళ్ల పార్టీ వైసీపీని చిత్తుగా ఓడించాలి. జగన్కు ఓటేస్తే నేరగాళ్లకు ఓటేసినట్లే. దేశం దష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. రేపటి ఏపీ ప్రజాతీర్పు దేశానికే ఒక దిక్సూచి. ఫరూక్ అబ్దుల్లా జమ్మూకశ్మీర్ నుంచి వచ్చి టీడీపీకి ప్రచారం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి తరలివచ్చి టీడీపీకి ప్రచారం. త్వరలోనే మమతా బెనర్జీ, అఖిలేష్ వస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై 22పార్టీల నేతలు అండగా ఉన్నారు. బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ మాత్రమే ఏపీకి వ్యతిరేకం. తెలుగుదేశం
పార్టీ గెలుపు మొత్తం దేశానికే మలుపు. బీజేపీని, దానితో అంటకాగే వైసీపీని చిత్తుగా ఓడించాలి” అని సీఎం వ్యాఖ్యానించారు. ఇవాళ ఉదయం టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ”ఆనంద ఆంధ్రప్రదేశ్ మనందరి లక్ష్యం. అందరికీ ఆమోదయోగ్య పాలన ఇస్తాం. రాబోయే 13రోజులు అవిశ్రాంతంగా పనిచేయాలి. ఒత్తిడిలోనే వీరోచితంగా అందరం పోరాడాలి. వైసీపీ ప్రలోభాలకు లొంగం. బీజేపీ, టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడం. ఎంత అణగదొక్కితే అంత విజ ంభిస్తాం. కర్ణాటక మంత్రులపై ఐటీ దాడులు బీజేపీ వేధింపులకు పరాకాష్ట. ఓటమి భయంతోనే బీజేపీ తప్పుల మీద తప్పులు చేస్తుంది” అని చంద్రబాబు వివరించారు.
ఒక కులానికో, ఒక ప్రాంతానికో టీడీపీ పరిమితం కాదని సీఎం చంద్రబాబు చెప్పారు. అందరివాడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. అన్నివర్గాల ప్రజలకు తెలుగుదేశం అండగా ఉంటుందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడతామని స్పష్టం చేశారు. ”ఆనంద ఆంధ్రప్రదేశ్ మనందరి లక్ష్యం. అందరికీ ఆమోదయోగ్య పాలన ఇస్తాం. రాబోయే 13రోజులు అవిశ్రాంతంగా పనిచేయాలి. ఒత్తిడిలోనే వీరోచితంగా అందరం పోరాడాలి. వైసీపీ ప్రలోభాలకు లొంగం. బీజేపీ, టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడం. ఎంత అణగదొక్కితే అంత విజ ంభిస్తాం. కర్ణాటక మంత్రులపై ఐటీ దాడులు బీజేపీ వేధింపులకు పరాకాష్ట. ఓటమి భయంతోనే బీజేపీ తప్పుల మీద తప్పులు చేస్తుంది” అని చంద్రబాబు వివరించారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. వాడవాడలా పసుపు జెండా రెపరెపలాడాలన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రజల మధ్య వేడుకగా జరపాలని చెప్పారు. ఎన్టీఆర్ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సీఎం సూచించారు. 38ఏళ్లుగా టిడిపిని గుండెల్లో పెట్టుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 38ఏళ్ల చరిత్రలో ఏ పార్టీకి దక్కని గౌరవం టీడీపీకి దక్కిందన్నారు. 23ఏళ్లు అధికారం ప్రజల్లో టీడీపీ ఆదరణకు నిదర్శనమని పేర్కొన్నారు.
”నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం, సమస్యలను పరిష్కరిస్తున్నాం. టీడీపీకి ప్రజలే ముందు (పీపుల్ ఫస్ట్). సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ మాటే మన మార్గం. పేదరికం లేని ఆనందదాయక సమాజం ఏర్పాటే టీడీపీ లక్ష్యం. ఈ ఐదేళ్లలో సంక్షేమ విప్లవం తెచ్చాం. పారిశ్రామిక విప్లవం, క్షీర విప్లవం, హరిత విప్లవం చూశాం. అలాంటిది సంక్షేమ విప్లవం తెచ్చిన ఘనత టీడీపీదే. ఈ సంక్షేమ విప్లవాన్ని ఎన్టీఆర్కే అంకితం చేస్తున్నాం” అని చంద్రబాబు వివరించారు ”రాష్ట్రంలో, దేశంలో సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీఆర్. పేదలే దేవుళ్లుగా టీడీపీ చేసే సంక్షేమానికి ఎన్టీఆర్ ఆశీస్సులు. సంక్షేమంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచింది. జనాభాలో 98% మందికి ప్రభుత్వ లబ్ది అందడం ఒక చరిత్ర. 38ఏళ్ల పూర్తి పరిపక్వతతో తెలుగుదేశం పార్టీ ఉంది. అద్భుతాలు స ష్టించే నడి వయసులో ఉన్నాం. సకల జనుల సౌభాగ్యం తెలుగుదేశం లక్ష్యం” అని సీఎం చెప్పారు.


