ఇస్రో చరిత్రలో మరో విజయం !
- 10 Views
- admin
- April 1, 2019
- Home Slider అంతర్జాతీయం జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం
ఇమిశాట్ రాకతో శత్రు రాడార్ల ఖేల్ ఖతం !—————
శ్రీహరికోట, ఫీచర్స్ ఇండియా : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సక్సెస్ సాధించింది. పీఎస్ఎల్వీ సీ 45 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇమిశాట్‌తో పాటు 28 విదేశీ ఉపగ్రహాలను వాటి కక్ష్యలో ప్రవేశపెట్టింది. నాలుగు స్టపాన్ బూస్టర్ల సాయంతో చేపట్టిన ప్రయోగం కావడంతో దీనికి పీఎస్ఎల్వీ క్యూఎల్ అని పేరు పెట్టారు. ఇస్రో చరిత్రలో ఈ తరహా రాకెట్ ప్రయోగం ఇదే మొట్టమొదటిది కావడం విశేషం. నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 45 28 గంటలపాటు సాగిన కౌంట్‌డౌన్ పీఎస్ఎల్వీ ప్రయోగానికి ముందు 28 గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగింది. ఆదివారం ఉదయం 5.27 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ సోమవారం ఉదయం 9.27గంటల వరకు కొనసాగింది. రాడార్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టిన ఈ ప్రయోగం 3గంటల్లో పూర్తైంది. నాలుగు దశలు.. 29 ఉపగ్రహాలు.. పీఎస్ఎల్వీ సీ 45 ప్రయోగం నాలుగు దశల్లో జరిగింది. భారత్‌కు చెందిన ఇమిశాట్‌తో పాటు అమెరికాకు చెందిన 24, లిథువేనియాకు చెందిన రెండు, స్పెయిన్, స్విట్జర్లాండ్ కు సంబంధించి ఒక్కో శాటిలైట్‌తో కలుపుకుని మొత్తం 28 విదేశీ నానో ఉపగ్రహాలను ఒకదాని తర్వాత ఒకటి కక్ష్యలోకి చేర్చారు. 749కిలోమీటర్ల ఎత్తున్న కక్ష్యలో ఇమిశాట్‌ను ప్రవేశపెట్టిన సైంటిస్టులు, విదేశీ ఉపగ్రహాలను 504కిలోమీటర్ల భూకక్ష్యలో నిలిపింది. ఇక నాలుగవ దశలో మైక్రో గ్రావిటీని స ష్టించి పరిశోధనలు చేపట్టనున్నారు. శత్రురాడార్ల పనిపట్టే ఇమిశాట్ డీఆర్డీఓ రూపొందించిన ఇమిశాట్ శత్రు దేశాల రాడార్ల జాడ గుర్తించడంలో దిట్ట. 436 కిలోల బరువున్న ఈ శాటిలైట్ తక్కువ ఎత్తు కక్ష్యలో తిరుగుతూ రక్షణశాఖకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా శత్రుదేశాల రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని అందించనుంది. ఇప్పటి వరకు ఇలాంటి సమాచారం సేకరణ కోసం భారత్ విమానాలపై ఆధారపడుతోంది. ఇమిశాట్ రాకతో ఇక అంతరిక్షం నుంచి శత్రువుల కదలికలపై కన్నేసే అవకాశం లభిస్తుంది.
ఏమిటీ ఇమిశాట్
ఇక భారత్ ప్రవేశపెట్టిన ఇమిశాట్‌ను హైదరాబాద్‌లోని డీఆర్డీవో ల్యాబ్‌లో అభివ ద్ధి చేశారు. ఇజ్రాయిల్‌కు చెందిన నిఘా ఉపగ్రహం ఎస్‌ఏఆర్‌ఏఎల్ ప్రేరణతో దీనిని రూపొందించారు. అత్యంత పదునైన ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ దీనికి ఉంది. ఇది శత్రుదేశాల రాడార్లపై నిఘా పెడుతుంది. ప్రాజెక్టు కౌటిల్యా కింద దీనిని అభివ ద్ధి చేశారు. భారత్‌కు చెందిన ఐఎంఎస్ ప్లాట్‌ఫామ్‌పై దీనిని సిద్ధం చేశారు. ఇది 436 కిలోల బరువు ఉంది. దీనిలో డీఆర్డీవో అభివ ద్ధి చేసిన ఎలక్ట్రానిక్ స్పెక్ట్రమ్ పరికరాన్ని అమర్చారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 432కోట్లు వెచ్చించినట్లు సమాచారం. 749 కిలోమీటర్ల పైన సన్‌సింక్రోనస్ ఆర్బిట్‌లోకి చేర్చిన ఈ శాటిలైట్ 8ఏళ్ల పాటు పనిచేస్తుంది.
రక్షణ రంగంలోకి ఉపయోగించే ఉపగ్రహాల సమాచారాన్ని పూర్తిస్థాయిలో వెల్లడించరు. కానీ దీనికి ఉన్న ప్రాథమిక లక్షణాలను బట్టి ఈ శాటిలైట్ రేడియో సంకేతాలను పసిగట్టగలదు. ఇది రాడార్ నెట్‌వర్క్‌పై ఓ కన్నేసి పెడుతుంది. శత్రుదేశాలు ఎక్కడెక్కడా రాడార్లను అమర్చారో గుర్తించి సమాచారం అందజేస్తుంది. శత్రుదేశాల భౌగోళిక పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం , చిత్రాలను అందజేస్తుంది. గతంలో ఈ పనిచేయడానికి డ్రోన్లు , బెలూన్లను ఉపయోగించేవారు కానీ ఇప్పుడు ఇమిశాట్ రాకతో 24గంటలు నిఘావేసే అవకాశం దక్కుతుంది. యుద్ధ సమయంలో ఏ దేశమైన తొలుత శత్రుదేశాల కమ్యూనికేషన్ స్థావరాలను, వ్యవస్థలను దెబ్బతీస్తుంది. అప్పుడు శత్రువు చుట్టు అంధకారం నెలకొంటుంది. సరైన లక్ష్యాలు తెలియకుండా దాడి చేయడానికి శత్రవుకు అవకాశం ఉండదు. అందుకే ముందుగా శత్రువుల కమ్యూనికేషన్ స్థావరాలు, రాడార్ వ్యవస్థలను గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇమిశాట్ చేసేది అదే. ఇప్పటికే ఆత్మాహుతి ‘హరూప్’ డ్రోన్లను భారత్ కొనుగోలు చేస్తోంది.
కీలక లక్ష్యాలను దొరకబుచ్చుకొన్న వెంటనే దాడి
యుద్ధ రంగంలో కీలకమైన మొబైల్ రాడార్ కేంద్రాలు, రాడార్లు అమర్చిన యుద్ధనౌకలు, కీలకమైన క్షిపణి ప్రయోగ వేదికలను, ప్రత్యర్థుల గగనతల రక్షణ వ్యవస్థలను గుర్తించి దాడి చేయడానికి ఈ డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తారు. కొన్ని రకాల ప్రత్యేక లక్ష్యాల కోసమే ఈ డ్రోన్లు వేటకు బయల్దేరతాయి. తమ లక్ష్యాలను వెతుక్కొంటూ దాదాపు 1,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలవు. వీటికి అత్యాధునిక కెమెరాలను, ఇతర నిఘా పరికరాలను అమర్చారు. వీటి ద్వారా శత్రువుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టొచ్చు. ఇవి యాంటీ రేడియేషన్ డ్రోన్లు. వీటిని గుర్తించడం కూడా కష్టం. సాధారణంగా రాడార్లను పెద్ద విమానాలను గుర్తించడానికి తయారు చేస్తారు. ఈ డ్రోన్లు విమానాల కంటే చాలా చిన్నవిగా ఉండటంతో వీటిని గుర్తించడం కష్టం. వీటి రాడార్ క్రాస్ సెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. భారత్ వద్ద ఇప్పటికే దాదాపు 8కిపైగా నిఘా శాటిలైట్లు ఉన్నట్లు సమాచారం. కార్టోశాట్ సిరీస్‌లోని నాలుగు శాటిలైట్లు పూర్తిగా సైనిక అవసరాల కోసమే పనిచేస్తాయి.


