.తెలుగు దేశం గెలుపు ఏకపక్షం !
- 11 Views
- admin
- April 1, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
పారదర్శకంగా ప్రతి పైసా లబ్ధిదారుడికి ఖాతాలోకి———
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల్ని ఆదుకున్నాం——
పథకాల గురించి ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పండి———-
అంగన్వాడీ, ఆశావర్కర్ల, హోంగార్డుల జీతాలు పెంచాం———
ఎనిమిది రోజుల పాటు అవిశ్రాంతంగా పనిచేయండి——–
43 లక్షల పక్కా ఇళ్ల లబ్ధిదారులకు 10 వేల కోట్ల రూపాయిల లబ్ధి———
టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు————
అమరావతి, ఫీచర్స్ ఇండియా : ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాబోయే ఎనిమిది రోజులు అవిశ్రాంతంగా పని చేయాలని తెదేపా నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు నిచ్చారు. సంస్థాగత బలమే తెలుగుదేశం పార్టీ బలమని, ఈ ఎన్నికల్లో సాంకేతికత తెదేపాకి కలిసొచ్చే అంశమని అన్నారు. సేవామిత్రలు, బూత్ కన్వీనర్లు పట్టుదలగా పని చేయాల న్నారు. ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో.. బూత్ కన్వీనర్ కూడా అంతే ముఖ్యమని చంద్ర బాబు అన్నారు. సోమవారం పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి బూత్‌లో ఓటర్లను వ్యక్తిగతంగా కలవాలని, తెదేపాకు అందరి మద్దతు సాధించాలని వారికి సూచించారు. వీవీప్యాట్ రశీదులపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని, వీటి ఉపయోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. గత ఐదేళ్లలో పేదల సంక్షేమం సంతప్త స్థాయికి చేర్చామని, పారదర్శకంగా ప్రతి పైసా లబ్దిదారుడి ఖాతాలో వేస్తున్నామని తెలిపారు. పేదరికం నిర్మూలనకు 10 సూత్రాలు ప్రకటించామన్నారు. రూ.10 వేల కోట్లతో బీసీ బ్యాంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని, నెలకు రూ.3 వేల రూపాయలు పింఛను, 150 యూనిట్ల ఉచిత విద్యుత్, ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా రూ.5 లక్షలు, చంద్రన్న బీమా రూ.10 లక్షలు ఇస్తున్నామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో గహ రుణాలను రద్దు చేశామని, 43 లక్షల పక్కా ఇళ్ల లబ్ధిదారులకు రూ.10 వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూరనుందని అన్నారు. వీటన్నింటినీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రైతులకు రూ. 24 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామన్నారు. అన్నదాత సుఖీభవతో సీజన్‌కు ముందే పెట్టుబడులు అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, చిరుద్యోగులు అందరినీ ఆదుకున్నామని తెలిపారు. అంగన్వాడీ, హోం గార్డులు, వీఆర్ఏలు, ఆశా వర్కర్ల జీతాలు పెంచామని, అన్ని వర్గాల అభిమానం పొందామన్నారు. తెదేపా గెలుపు ఏకపక్షం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.
శాస్త్రవేత్తలకు సీఎం అభినందనలు
సోమవారం ఉదయం జరిపిన పీఎస్ఎల్వీ సీ-45 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. విజయాలను తమ చిరునామాగా ఇస్రో మార్చుకుంటోందని ఆయన కొనియాడారు. దేశానికే గర్వకారణం మన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.


