చంద్రబాబు రాకతో టీడీపీలో ఫుల్‌జోష్
- 8 Views
- admin
- April 1, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ములగాడ, ఫీచర్స్ ఇండియా : ఆదివారం తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలొ ప్రచారం ముమ్మరంగా సాగిస్తు పార్టీ శ్రేణులొ కార్యకర్తల్లొ పూర్తి ఆత్మ విశ్వాసం నింపడంతొ అందరిలొ ఒక్కసారి ఆనందం కేరింతలు కొడుతూ పార్టీ శ్రేణులు అందరూ ఫూల్ జోష్తొ ప్రచారాల్లొ చురుగ్గా పాల్గొంటున్నారు.మీ భవిష్యత్తు నా భాద్యతంటు పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడుకు నీరాజ నాలు పలికారు.
వై.సీ.పి నాయకుల తే.దే.పా లొకి చేరికలు జొరు…
పశ్చిమ నియోజకవర్గంలొ గణబాబు కన్పించిన రాజికీయం వెనుక కనిపించని మంతనాలు చేస్తు పశ్చిమలొ వై.సీ.పిని నిర్విర్యం చేసేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తు వై.కా.పాలొ ముఖ్యమైన పార్టీ శ్రేణలను పార్టీలొకి ఆహ్వానించి చంబ్రాబు సమక్షంలొ పార్టీ కండువాలు కప్పి పశ్చిమలో రాజకీయాన్ని ఒక్కసారిగా వేడెక్కిం చారు. ముఖ్యంగా ఎన్నోయాళ్ళతరబడి ఈనియోజక వర్గంలో వివిధ పార్టీలకు సేవలిందించి రాజకీయ దురందురడుగా పేరున్న మాజీడిప్యూటీ మేయర్ దాడిసత్యన్నారాయణ మరియు ఇదేకోవలో వైసీపీకి చిరకాలంగా సేవలందిస్తూ తనకంటూ ఒక సామాజిక వర్గాన్ని ఏర్పాటుచేసుకుని తన సత్తా చాటగల మూగి సూర్యనారాయణ వీరిరువురూ కలిసి తేదేపా తీర్ధం పుచ్చుకోవటంతో ఈ ప్రాం తప్రజల్లో ఒక్కసారిగా గుసగుసలు మొదలు అయ్యాయి. ఇదంతా గణబాబు ఎప్పటికప్పుడు వార్డు స్థాయి నాయకులతో సంప్రదింపులు జరుపుతూ తన దైన శైలితో వైకాపాను దెబ్బతీసే విధంగా తన ఆదిపత్యాన్ని చాటుకునేవిధంగా వ్యూహాలు రచిస్తూ మును ముందు వైకాపా పార్టీశేణ్రులను తమపార్టీలోకి ఆహ్వానం పలికేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్టు విశ్వశనీయస మాచారం.
దాడి, మూగి రాకతో వైకాపకు ఎంతమేరకు నష్టం…
పశ్చిమలో వీరిఇరువురూ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని ఓటింగ్ విషయంలో ప్రణాళికలు సిద్దంచేసుకుంటూ పార్టీని ఎలాగైనా గెలిపించాలనే తపనతో తమతమ సామాజిక వర్గాలతో మమేకమై వైకాపాను ఓడించాలనే ఉద్దేశంతో పావులు కదుపుతూ నిరంతరం గణబాబుతో చర్చలు జరుపుతూ మీగెలుపు మాబాధ్యత అంటూ వీరివురూ ముందుకు సాగుతూ తమ వార్డుల్లో కాకుండా పక్కవార్డులో కూడా ఓటర్లకు గేలంవేస్తూ టీడీపీని గెలిపిచేవిధంగా వురకలువేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదిలా జరిగితే వైకాపాకు పశ్చిమలో బంగపాటు తప్పదని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ వైకాపా వార్డు స్థాయినాయకులను మళ్ళవిజయప్రసాద్ పూర్తిగా నమ్మి వార్డుల వారీగా తన కేడర్‌ను నిరూపించుకుంటూ మొత్తం బాధ్యతలను పంచపాండవులకు అప్పగించటంతో ఈవార్డు స్థాయినాయకులు అంతర్గత విభేదాలతో పార్టీ పటిష్టతను దెబ్బతీసేవిధంగా వ్యవాహారం సాగటంతో ముఖ్యమై నాయకులు పార్టీని వీడుతున్నారన్న ఆరోపణలు మెండుగా వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో పార్టీ అపాఖ్యతలు వస్తున్నాయంటే అతి ఈపంచపాండవుల వల్లే జరుగుతుందన్న విషయం వాస్తవం.
ఈపరిణామలనేపథ్యంలో మళ్ళవిజయ ప్రసాద్ ఉత్పన్నమవుతున్న సమస్యలను క్షేత్రస్థాయిలో వార్డు నాయకుల్లో సమన్వయపరుస్తూ చర్చిలు జరిపి పార్టీకి కటుటబడి ఉన్న వ్యక్తులకు వార్డుల వారిగా బాధ్యతలు అప్పగించి పార్టీ నాయకుల లోపాలను సరిదిద్దుకుంటూ, వార్డునాయకులకు గట్టి హెచ్చరికలు చేస్తూ సమన్వయ పర్చుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అబిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు.


