చంద్రబాబు మళ్లీ వస్తేనే ఏపీ అభివృద్ధి
- 13 Views
- admin
- April 2, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
గత ఎన్నికల్లో మోడీ చాయ్‌వాలా అన్నారు.. ఇప్పుడు చౌకీదార్ అంటున్నారు————-
తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్——————
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : చంద్రబాబుతోనే ఎ.పి. అభివృద్ధి ముడిపడి ఉందని, ఆయన మళ్లీ వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందని.. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ కోరారు. తగరపువలసలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ అన్ని రాష్ట్రాలు నేతలు భయపెడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో మోడీ ఛాయ్‌వాలా అన్నారు.. ఇప్పుడు చౌకీదారు అంటున్నారని రామ్ విమర్శించారు. మోడీ ప్రజలకు కాదు.. దోపిడీదారులకు కాపలాదారు అని రామ్ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల తరువాత నరేంద్రమోడీని గుజరాత్‌కి, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి లోటస్‌పాండ్‌కి పోవడం ఖాయమని తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తెలిపారు. ఈసందర్భంగా విభజనతో నష్టపోయిన ఏపీ పట్ల మోడీ వ్యవహరించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్ల క్రితం మోడీ ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సాయం చేస్తానని మోసం చేశారన్నారు. హుదూద్ సాయంలో రూ. వంద కోట్లను ఇస్తానని కేవలం రూ. 650 కోట్లే ఇచ్చారన్నారు. నామమాత్రంగానే విశాఖ రైల్వే జోన్ ఇచ్చారని రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో టిడిపి చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓట్లు వేయాలని ప్రజలకు రామ్ సూచించారు. చంద్రబాబు పాలనలోనే రాష్ట్రంతోపాటు అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. కష్టకాలంలోనూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దూసుకెళ్లేలా చంద్రబాబు చేశారన్నారు. సమర్థవంత చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలన్నారు. టిడిపి అభ్యర్థులకు ప్రజలు ఘన విజయం అందించి చంద్రబాబును మళ్లీ సీఎం చేయబోతున్నారని తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తెలిపారు.


