రారండోయ్ నూకాలమ్మ జాతర చూద్దాం
- 23 Views
- admin
- April 2, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం వంటిల్లు స్థానికం
నేడు నూకాంబిక అమ్మవారి జాతర ప్రారంభం————-
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గట్టి చర్యలు———-
ఆలయ సహాయ కమిషనర్ సుజాత——————-
అనకాపల్లి టౌన్, ఫీచర్స్ ఇండియా : ఉత్తరాంధ్ర ప్రజలు ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన అనకాపల్లి శ్రీ నూకంబిక అమ్మవారి జాతర బుధవారం రాత్రి ప్రారంభం కానుంది. ఇప్పటికే కొత్త అమావాస్య జాతర ఉత్సవాలు కు వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఆలయంలో ఆలయం వెలుపల పటిష్టమైన క్యూలైన్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఆలయ సహాయ కమిషనర్ ఎన్ సుజాత తెలిపారు .భక్తులు వేసవి ఎండలు బారిన పడకుండా ఆలయ ఆవరణమంతా చలువపందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. భక్తుల సౌకర్యం కోసం మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు .జీవీఎంసీ సహకారంతో ఈ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఆలయ పరిసరాల పరిశుభ్రతకు ఆలయ నిర్వహణతోపాటు జివిఎంసి కూడా తమ సహకారం అందిస్తుందన్నారు .భక్తులకు క్యూలో మంచినీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే అన్నదానం భక్తులకు అందుబాటులో కీ తెస్తున్నామని ఆమె చెప్పారు. పోలీస్ శాఖ ఆలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్తు నిర్వహిస్తుందన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు చేపడుతున్నారు
అమ్మవారి ఆలయ చరిత్ర…
సుమారు 600 ఏళ్ల క్రితం 1450 సంవత్సరంలో అమ్మవారి ఆలయం నిర్మించబడింది. అప్పటి కాలంలో నూకాంబిక అమ్మవారి ని ప్రజలు కాకతాంబగా కొలిచేవారు. ఆర్కాట్ నవాబు దగ్గర సైన్యాధిపతిగా పనిచేసిన కాకర్లపూడి అప్పలరాజు కళింగాంధ్ర ప్రభువైన బాహు భలేంద్రుని ఓడించి అనకాపల్లి కేంద్రంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక గవరపాలెం ప్రాంతంలో శత్రుదుర్భేద్యమైన కోటను నిర్మించి దక్షిణాన అమ్మవారి ఉత్తరాన బోగ లింగేశ్వర్ ని ఆలయాన్ని నిర్మించారు. తొలుత కోట దేవతగా ఉన్న ఈ అమ్మవారు కాలక్రమేణా గ్రామదేవతగా పూజలు అందుకుంటూ ప్రసిద్ధి చెందారు. తర్వాత కాలంలో అప్పలరాజు వంశీయుడైన జగన్నాధ రాజు ను పాయకరావుపేట వద్ద జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారు ఓడించారు. అనంతరం విజయనగరం రాజులను ఈ ప్రాంత పాలకులుగా బ్రిటిష్ వారు నియమించారు. విజయ నగర రాజులు కాకతాంబా అమ్మవారిని నూకాంబిక అమ్మవారి గా మార్పు చేసి కొలిచేవారు. తరువాత కాలంలో గోడి జగన్నాథ జగన్నాధ రాజును అనకాపల్లి కోటకు సామంతరాజుగా విజయనగర రాజులు నియమించారు. ఆయన అనేక మార్లు బ్రిటిష్ వారికి పన్నులు లు చెల్లించక పోవడంతో కోట వేలం వేయగా వేరిచర్ల ఆనందగజపతిరాజు వేలంపాటలో కోటను సొంతం చేసుకున్నారు. అప్పటినుంచి వైరిచర్ల వంశస్థులే శాశ్వత ధర్మకర్తలుగా వ్యవహరించేవారు. 1935లో లో ఆలయం దేవాదాయ శాఖ అధీనంలోకి వచ్చింది. అప్పటినుండి ఈ ఆలయం అభివ ద్ధి చెంది రాష్ట్రంలోనే ప్రసిద్ధ దేవాలయంగా వినుతికెక్కింది.


