వివాహిత అనుమానాస్పద మతి
- 15 Views
- admin
- April 2, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
మనస్పర్ధలే కారణమంటున్న స్థానికులు, భర్త————–
అనుమానస్పద మృతిగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు—————–
మధురవాడ, ఫీచర్స్ ఇండియా : భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగాదాలతో మనస్తాపానికి గురైన భార్య ఫ్యానుకు ఉరివేసుకుని మతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పీఎం పాలెం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కష్ణా జిల్లా బంటు పిల్లి గ్రామానికి చెందిన లుక్కా వీర రాఘవమ్మ (26)కు కులుక్కా శ్రీనివాసరావుతో 2017లో వివాహమైంది. వీరికి ఎనిమిది నెలల పాప ఉంది. వత్తి రిత్యా శ్రీనివాస్ పైడిభీమవరంలోని అరబిందో ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. జివిఎంసి 5వ వార్డు పరిధి చంద్రంపాలెం గ్రామంలోని శ్రీ కనకమహాలక్ష్మి నిలయం ఫస్ట్ ఫ్లోర్లో లో నివాసముంటున్నారు. ఎప్పటిలాగే ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చాడు. సోమవారం రాత్రి భోజనం విషయంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగాదా నెలకొంది. కోపంతో రాఘవమ్మ బెడ్రూంలోకి వెళ్లిపోయింది. ఎనిమిది నెలల పాపతో శ్రీనివాస్ హాల్లోనే నిద్రపోయాడు. ఎప్పటిలాగే శ్రీనివాసరావు మంగళవారం తెల్లవారుజామున డ్యూటీకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. అయితే బెడ్రూమ్లో ఉన్న రాఘవమ్మ తలుపులు తెరవకపోవడంతో తలుపుకొట్టి ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. దీంతో అనుమానం వచ్చిన శ్రీనివాసులు తలుపు బద్దలు గొట్టి చూసే సరికి రాఘవమ్మ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. స్థానికులు వెంటనే పీఎం పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. సీఐ సూర్యనారాయణ ఆదేశాల మేరకు ఎస్సై హరికష్ణ సంఘటన స్థలానికి చేరుకుని మతదేహాన్ని పరిశీలించారు. రాఘవమ్మ మృతికి కారణాలను అడిగి తెలుసుకోన్నారు. మతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. అనుమానాస్పద మతిగా కేసు నమోదు చేశామని ఎస్సై హరికష్ణ తెలిపారు.


