మా రాష్ట్రానికి అన్యాయం చేస్తే ఖబడ్దార్ జాగ్రత్త
- 9 Views
- admin
- April 2, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తామంటే ఊరుకునేది లేదు—————-
మోడీ, కేసీఆర్, కోడికత్తి పార్టీ కలిసి మనపై మూకుమ్మడి దాడి చేస్తున్నాయి———–
నేతలతో సీఎం చంద్రబాబు——————
అమరావతి, ఫీచర్స్ ఇండియా : ‘మోదీ, కేసీఆర్, కోడికత్తి పార్టీ కలసి మనపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు.. ఇది నాపై దాడి కాదు… రాష్ట్రంపై దాడి. ఈ వలస పక్షులను కేసీఆర్ పంపిస్తున్నారు అని ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళవారం పార్టీ నాయకులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. హైదరాబాద్ నుంచి వలస పక్షులొచ్చి ఏపీ ప్రజలకు నీతులు చెబుతారా.. హైదరాబాద్‌లో కేసీఆర్‌కు ఊడిగం చేసుకుంటే చేస్కోండి. మీరు హైదరాబాద్‌లో బతకాలంటే బతుకొచ్చు.. మా రాష్ట్రానికి వచ్చిన అన్యాయం చేస్తే ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ ఆటలు ఈ రాష్ట్రంలో సాగనివ్వను’ అంటూ నిప్పులు చెరిగారు.
హైదరాబాద్‌లో తనకు ఊడిగం చేస్తున్నందుకు.. ఏపీకి వెళ్లి టీడీపీని ఓడించాలని బెదిరిస్తే వాళ్లంతా ఇక్కడ వాలిపోతున్నారు. బెంగళూరు, చెన్నై నుంచి వచ్చి మనల్ని తిడితే ఊరుకుంటామా?
జన్మభూమి సాక్షిగా గుణపాఠం చెబుతాం. కావాలంటే కాల్మొక్తా బాంచన్ అని కేసీఆర్ కాళ్లు కడిగి, ఆ నీళ్లు కూడా మీద చల్లుకోవచ్చు’. హైదరాబాద్ నుంచి వచ్చిన వలస పక్షుల మాటలు నమ్మొద్దంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. హైదరాబాద్ నుంచి వచ్చిన వలస పక్షులకు ఆంధ్రప్రదేశ్‌లో ఏం పని అంటూ ప్రశ్నిం చారు. ఈ వలస పక్షులన్నీ హైదరాబాద్‌లో కేసీఆర్‌కు ఊడిగం చేసుకుంటే చేసుకోవచ్చని.. ఏపీకి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతామంటే ఊరుకునేది లేదన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో ప్రచార సభలో మాట్లాడిన చంద్ర బాబు.. పరోక్షంగా నటుడు మంచు మోహన్‌బాబు, వైసీపీలో చేరిన సినిమా సెల్రబిటీలపై నిప్పులు చెరిగారు.
‘హైదరాబాద్ నుంచి వలసపక్షులు వచ్చాయి. చిత్తూరు జిల్లాలోనే కాలేజీ పెట్టుకున్న ఓ వలస పక్షి కూడా హైదరాబాద్ నుంచి వచ్చింది. సినిమాలు, అవకాశాలు లేని కొన్ని వలస పక్షులు ఏపీకి వస్తున్నాయి. ‘టీడీపీ ముందు చూపుతోనే హైదరాబాద్ అభివద్ధి జరిగింది.. మీరు అక్కడ ఆనందంగా ఉండండి మాకు ఎలాంటి బాధలేదు. విభజన తర్వాత హైదరాబాద్ మాకు దక్కలేదన్న బాధ ఉన్నా.. లక్ష కోట్లు కేసీఆర్ మోసం చేశారని బాధ ఉన్నా.. భగవంతుడు ఇచ్చిన కష్టపడే తత్వంతో రాష్ట్రాన్ని అభివ ద్ధి చేసుకుంటున్నాం. మోద, కేసీఆర్‌లకు అమరావతి అభివ ద్ధి చెందడం ఇష్టం లేదు. అందుకే జగన్‌ను అడక్డుపెట్టుకొని కుట్రలు చేస్తున్నారు. రైతులు ల్యాండ్ పూలింగ్‌లో ఇచ్చారు.. వారికి పాదాభివందనం చేస్తున్నా ఎప్పుడూ రుణపడి ఉంటా’అన్నారు.
ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ వైసీపీ మొసళ్లు తెగ కన్నీరు కారుస్తున్నాయని.. ఒక్కసారే కదా అని తినే తిండిలో విషం కలుపుకోం కదా… లోయలో దూకం కదా అని సీఎం వ్యాఖ్యానించారు. పసుపు-కుంకుమ డబ్బులు ఆపాలని వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు వేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. ఆడపడుచులకిచ్చే పసుపు-కుంకుమను ఎవరైనా అడ్డుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్దె మైకులు, వలస పక్షులు వైసీపీకి మద్ధతుగా ప్రచారం చేస్తున్నారని, ఎన్నికలు కాగానే అందరూ హైదరాబాద్ చెక్కేస్తారని చంద్రబాబు జోస్యం చెప్పారు. పులివెందులలో తన పర్యటనకు అద్భుతమైన స్పందన వచ్చిందని.. అన్ని చోట్లా టీడీపీపై సానుకూలత వ్యక్తమవుతోందన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తే తమకూ ఇవ్వాలన్న కేసీఆర్‌తో కలిసి ఏపీకి జగన్ హోదా తెస్తారా అని సీఎం ప్రశ్నించారు. సాగర్, శ్రీశైలం తమకే ఇవ్వాలన్న వ్యక్తితో కుమ్మక్కవ్వడమేంటని నిలదీశారు. కోర్టు కేసుల కోసం మోడీతో, ఆస్తుల కోసం కేసీఆర్‌తో జగన్ లాలూచీ పడ్డారని ఆయన విమర్శించారు.


