అనకాపల్లిలో పీలా ఎదురీత
- 12 Views
- admin
- April 3, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
దేశం శ్రేణుల్లో గుబులు“““““`
వెన్నాడున్న అవినీతి“““
బలమైన సామాజిక వర్గాలు మద్దతు కరవు““““`
జర్బలిస్టుల స్ధలాలపై సైతం కబ్జా కన్ను ?“““““`
చోటా నేతల చేతివాటంపై ఓటర్లలో తీవ్ర ఆగ్రహం““““““`
విశాఖ రూరల్, ఫీచర్స్ ఇండియా : అనకా పల్లి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎదురీదుతుంది. ఈ పార్టీకి ఎపుడు అండగా ఉండే కాపు, గవర సామాజిక వర్గాలు మద్దతు ఈ సారి ప్రతిపక్ష పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఈ సామాజిక వర్గాలకు చెందినవారు పెద్ద సంఖ్యలో వైకాపా, జనసేన పార్టీలలో చేరడం అధికార తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదు. దేశం పార్టీలో అంతర్లీనంగా ఉన్న అసంతృ ప్తివాదులు లోపాయికారీగా ప్రతిపక్షాలుకు స్నేహ హస్తం అందిస్తుండడంతో టీడీపీకి గెలుపుదారులు మూసుకుపోతున్నట్లు పార్టీవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఐదేళ్లలో పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు, సంక్షేమ పధకాల లో సైతం చేతివాటం చూపడంతో లబ్దిదారులలో కూడా అసంతృప్తి కనిపిస్తుంది. సంక్షేమ పధకాలు తనను ఒడ్డున పడేస్తాయని పీలా గట్టిగా ఆశిస్తు న్నారు. అయితే దేశం పార్టీ ఛోటా నాయకులు సంక్షేమ పధకాలలో చేతివాటం చూపడంతో మహిళలలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఫించ న్లు, హౌసింగ్ లబ్దిదారుల ఎంపిక ఈ నియోజక వర్గంలో ఇష్టారాజ్యంగా సాగింది. డబ్బు ఉన్నవారి కి ఫించన్లు, గృహాలు మంజూరు చేయడం పట్ల నిరుపేదవర్గాలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవు తుంది. చివరకు హుదూద్ తుఫాన్ లబ్దిదారుల ఎంపికలో కూడా అర్హులకు కాకుండా పట్టణం లోని 34 వార్డులలో పదేసి ఇళ్లను అధికారపార్టీ కార్యకర్తలకు కట్టబెట్టడం బాహాటం కావడంతో పీలా అవినీతిపై చర్చ జరుగుతుంది. ఇటువంటి అవకతవకలపై ఫిర్యాదులు వెల్లువెత్తినా అధికారులు స్పందించపోవడంతో ప్రజలు ఇక్కడ మార్పు కోరుకుంటున్నారు. ఇక అభివృద్ధి పేరిట సాగిన రోడ్ల నిర్మాణంలో అవినీతి అయితే చెప్పక్కర్లేదు. ఎస్లిమేట్లను పెంచివేయడం, నాణ్యతలేకుండా నిర్మాణాలు సాగించడం, శుభ్రంగా ఉన్న రోడ్లపై లేయర్ వేసి సొమ్ము చేసుకోవడం వంటి కార్యక్రమాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూమి కనిపించినా పాగా వేసేయడం వంటివి నియోజకవర్గం వ్యాప్తిగా కనిపిస్తున్నాయి. పీలా అవినీతిపై రైతులు ఇటు అమరావతిలోనూ, అటు ఢిల్లీలోనూ నిరశనదీక్షలు చేపట్టారు. అలాగే సీనియర్లను పక్కన పెట్టి తన మనుషులకు పెత్తనం ఇవ్వడం, వారు ప్రభుత్వశాఖలను తమ గుప్పెట్లో పెట్టుకుని పైరవీలు సాగించడం వంటి కార్యక్రమాలు పార్టీశ్రేణులకు సైతం రుచించలేదు. పీలాను తిరిగి పెందుర్తికి సాగనంపాలనే కృత నిశ్చయం పార్టీవర్గాలలో ఉంది కనుక వారు తూతూ మంత్రంగానే ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు ఆర్ఈసీఎస్ ఛైర్మన్ ఎంపిక విషయంలో అనకాపల్లి మండల నాయకులను చిన్నచూపు చూసి గేలి చేసి మాట్లాడడంతో ఈ మండలంలోని పార్టీశ్రేణులలో చాపకిందనీరులా అసంతృప్తి కనిపిస్తుంది. దీని ప్రభావం ఎన్నికలలో ప్రతిపక్షాలకు కలసి వస్తుందని అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఎపుడూ కంచుకోటగా ఉండే కశింకోట మండలంలో కూడా ఎదురుగాలి వీస్తుండడం విశేషం. ఈ విధంగా నియోజకవర్గంలో ఎటు చూసినా ఎమ్మెల్యే పీలాకు సానుకూల అంశాలు కనిపించడం లేదు.
జర్నలిస్టుల స్ధలాలపై కబ్జా కన్ను
నియోజకవర్గంలో జరిగిన అవినీతి కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే జర్నలిస్టుల ఇళ్ల స్ధలాల విషయం ఒక ఎత్తు. వీరిని సైతం ఎమ్మెల్యే విడిచిపెట్టలేదు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు మంజూరు చేస్తే ఇక్కడ మాత్రం కాంగ్రెస్ హయాంలో మంజూరైన ఇళ్ల స్ధలాలను సైతం కబ్జా చేయడానికి ఎమ్మెల్యే తెగబడ్డారని పాత్రికేయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జర్నలిస్ట్‌లకు 2008లో అనకాపల్లి మండలం రేబాకలో ఇళ్ల స్ధలాలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన పీలా కన్ను ఈ భూములపై పడింది. గ్రామస్తులకు, జర్నలిస్టలకు మద్య తంపులు పెట్టి నేటికీ సమస్య పరిష్కారం కాకుండా ఉండిపోయింది. ఈ స్ధలంను పార్టీలో తిరుగుతున్న ఇక మహిళానేతకు కట్టబెట్టేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలిసింది. రెవెన్యూ అధికారులు కూడా ఎమ్మెల్యేకు కొమ్ము కాయడంతో వ్యవహారం పరిష్కారం కాకుండా ఉండిపోయింది. దీంతో విధిలేని పరిస్ధితులలో జర్నలిస్టులు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. ఈయన హయాంలో జర్నలిస్ట్‌లకు మేలు జరుగకపోగా తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించే ఇటువంటిఅ ఎమ్మెల్యేను ఎక్కడా చూడలేదంటూ పాత్రికేయులు తలలు పట్టుకుంటున్నారు.


