జన్‌ధన్ ఖాతాల్లోకి డబ్బులే డబ్బులు!
- 12 Views
- admin
- April 3, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ప్రత్యేక ప్రతినిధి, ఫీచర్స్ ఇండియా: దేేశ వ్యాప్తంగా ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకోవడానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు.. మందు,విందు, డబ్బులు ఖర్చుపెడుతున్నారు. మరోవైపు ఎంత కట్టుదిట్టం చేసినా ఎక్కడో అక్కడ లక్షలు, కోట్లల్లో డబ్బులు పట్టుపడుతూనే ఉన్నాయి. ఓటర్లకు పంచే వస్తు సామాగ్రి కూడా పట్టుపడుతుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని జన్‌ధన్ ఖాతాల్లోకి డబ్బులు కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతోంది.
వందలకొద్దీ ఖాతాల్లో పదేసివేల చొప్పున డబ్బు డిపాజిట్ అవుతోంది. ఒక్కో ఖాతాలో రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 1.7కోట్లు జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆదాయపు పన్నుశాఖ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. ఎన్నికలు సవిూపిస్తున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈ డబ్బు వారి ఖాతాల్లోకి జమ చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
కాగా, సార్వత్రిక ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో ఈ డిపాజిట్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. జన్‌ధన్ ఖాతాల్లోకి డబ్బులే డబ్బులు!


