నేరస్థుల పార్టీని నమ్మటానికి వీల్లేదు
- 10 Views
- admin
- April 3, 2019
- Home Slider జాతీయం తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
చెక్కులు చెల్లవని అన్నవారికి చెంపపెట్టు కావాలి———–
లబ్ధిదారుల సంక్షేమాన్ని అడ్డుకోవడానికి వైసీపీ కుట్రలు చేస్తుంది———–
టెలికాన్ఫరెన్స్లో నేతలతో సీఎం చంద్రబాబు వ్యాఖ్య—————
అమరావతి, ఫీచర్స్ ఇండియా : నిన్నంతా హైదరాబాద్లో ఉండి వైసీపీ అధినేత జగన్ మరో కుట్రకు పన్నాగం పన్నారని సీఎం చంద్రబాబు ఆరో పించారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేర స్థుల పార్టీని ఎక్కడా నమ్మటానికి వీల్లేదని పార్టీ నేత లతో చెప్పారు. పింఛన్ డబ్బులు ఇప్పటికే లబ్దిదా రులకు అందాయని, పసుపు- కుంకుమ, అన్నదాతా సుఖీభవ.. రుణమాఫీ లబ్ధిదారుల ఖాతాల్లో జమవు తాయని చెప్పారు. ఈ నాలుగైదు రోజుల్లోనే లబ్దిదారు ల ఖాతాల్లో జమచేస్తామని సీఎం పేర్కొన్నారు. అన్న దాత సుఖీభవ కింద ఇప్పటికే వెయ్యి జమయ్యాయని, త్వరలో మరో రూ. 3 వేలు కూడా జమవుతాయని తెలిపారు. చెక్కులు చెల్లవని ప్రచారం చేసిన వారికి ఇది చెంపపెట్టు కావాలన్నారు. లబ్దిదారుల సంక్షేమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ఎన్ని కుట్రల కైనా తెగిస్తుందని చంద్రబాబు దుయ్యబట్టారు. పింఛన్ డబ్బు లు ఇప్పటికే లబ్ధిదారులకు అందాయని సీఎం చెప్పారు. నాలుగైదు రోజుల్లోనే పసుపు-కుంకుమ, అన్నదాతా సుఖీ భవ, రుణమాఫీ డబ్బులు కూడా ఖాతాల్లో జమవుతాయ న్నారు. అన్నదాతా సుఖీభవ కింద ఇప్పటికే వెయ్యి రూపా యలు జమయ్యాయని, మరో రూ.3 వేలు కూడా జమవు తున్నాయని పేర్కొన్నారు. చెక్కులు చెల్లవని ప్రచారం చేస్తున్న వారికిది చెంపచెట్టు కావాలన్నారు. లబ్ధిదారుల సంక్షేమానికి అడ్డుకునేందుకు ఎంతటి కుట్రలకైనా వైకాపా తెగపడు తుందని విమర్శించారు.
ఐదేళ్ల తెదేపా ప్రభుత్వం వల్ల లాభం జరిగిందా? అంటే.. ప్రజలు చేతులెత్తి జైకొట్టే పరిస్థితుల్లో ఉన్నారని సీఎం చెప్పారు. ఎన్నికలకు మరో వారం మాత్రమే సమయం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజలతో మమేకమై ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు.


