ఘనంగా కొత్త అమావాస్య ఉత్సవాలు
- 14 Views
- admin
- April 6, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం వంటిల్లు స్థానికం
అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు————-
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు———–
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రామచంద్ర మోహన్——————
అనకాపల్లి టౌన్ ఫీచర్స్ ఇండియా : ఉత్తరాంధ్ర ప్రజలు ఇలవేల్పు కొలిచే అనకాపల్లి శ్రీ నూకంబిక అమ్మ వారి కొత్త అమావాస్య ఉత్సవాలతో పాటు శనివారం ఉగాది పర్వదినం సందర్భంగా అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెలుగు సంవత్స రాదిని పురస్కరించుకొని భక్తులు కుటుంబ సమే తంగా అమ్మవారి ఆలయానికి తెల్లవారుజాము నుండి తరలివచ్చి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు సమర్పిం చారు. ఉగాది సందర్భంగాదేవాదాయ ధర్మాదా య శాఖ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ దేవాదాయ శాఖ తరపున పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ ఎన్ సుజాత ఆలయ సంప్రదాయం ప్రకారం డిప్యూటీ కమిష నర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు సమర్పించారు.
ఉగాది పర్వదినం కావడంతో పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా భక్తులు అమ్మవారి ని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఆలయం నుండి ఆలయం వెలుపల రోడ్డుపై భక్తులు బారులు తీరారు. ఆలయానికి వచ్చే భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకొని ముడుపులు చెల్లించి కొని అమ్మవారికి పూజలు సమర్పించారు .కుటుంబ సమేతంగా తరలి వచ్చే భక్తుల కోసం వంట షెడ్లను ఆలయ నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆలయ కమిటీ చలువ పందిరిలు ఏర్పాటు చేశారు. చల్లని తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు .ఆలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ తాతారావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు.


