40ఏళ్ల అనుభవం చంద్రబాబుది, 31 కేసుల్లో నిందితుడు జగన్
- 15 Views
- admin
- April 6, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ప్రచారంలో గంటా శ్రీనివాసరావు—————
గంటాకు డాక్టర్లు మద్దతు———————
అధిక మెజార్టీతో గెలిపిస్తామన్న కళింగ వైశ్యుల సంక్షేమ సంఘం——————–
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : విశాఖ ఉత్తర నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థ్టి మంత్రి గంటా శ్రీనివాసరావుకు వాల్తేరు క్లబ్ మద్దతిచ్చింది. ఉత్తరంలో గంటాను రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని వారు తెలిపారు. అందుకు తగ్గట్టుగా కృసి చేస్తామన్నారు. నగరంలోని మేఘాలయ హోటల్లో ”ఇంటరాక్టివ్ సెషన్ విత్ గంటా శ్రీనివాసరావు” పేరిట వాల్తేర్ క్లబ్ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో నగరం లోని ప్రముఖులతో పాటు నార్త్ నియోజకవర్గంలో నివసించే క్లబ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్లబ్ సభ్యుడు పి. కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లా డుతూ గంటా నార్త్‌లో పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు. సేవాదక్పధం, సమర్ధ నాయకత్వం, లక్షణాలున్న వ్యక్తి గంటా అని వారు కొనియాడారు. ఈ ఎన్నికల్లో గంటా గెలుపునకు అందరూ కృషి చేసి అపూర్వ విజయాన్ని అందించాలని కోరారు. టీడీపీ అభ్యర్ధి మంత్రి గంటా మాట్లాడుతూ ఇలాంటి ఆత్మీయ సమావేశం ద్వారా తన గెలుపునకు కృషి చేసేందుకు ముందుకు వచ్చి వాల్తేర్ క్లబ్ సభ్యులను ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సమావేశాల వల్ల క్లబ్ సభ్యులలో ఐక్యత పెరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు నేను పోటీ చేసిన అన్ని నియోజక వర్గాల్లో కన్నా ఉత్తరంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తానన్న దీమా ఉందని ఇదంతా నియోజక వర్గ ప్రజలు తనను ఆదరించడం వల్లేనని తెలిపారు. దేశం గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు అయితే దేశం సిగ్గుపడే నాయకుడు ప్రతిపక్ష నేత జగన్ అని గంటా విమర్శించారు. ఇప్పుడే కాదు మళ్ళీ, మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని, మనం ఇలానే అభివద్ధి బాట కొనసాగించాలని గంటా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్దికి తాను కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాశీవిశ్వనాథం, క్లబ్ ప్రతినిధులు కంకటాల మల్లిక్ , సుంకర రవీంద్ర, సోమనాథ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
కళింగ వైశ్యుల సంక్షేమ సంఘం మద్దతు:
టీడీపీ నార్త్ అభ్యర్ధి గంటాకు కళింగ వైశ్యుల సంక్షేమ సంఘం మద్దతు తెలిపింది. సంఘం నేతలు విశ్వేశ్వరరావు, ప్రసాద్ ల ఆధ్వర్యంలో రైల్వే న్యూ కాలనీ లోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో కళింగ వైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి టీడీపీ ఉత్తర అభ్యర్ధి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు . ఈ సందర్భంగా సంఘం నేత విశ్వేశ్వర రావు మాట్లాడుతూ తమ కులస్తులకు ఇంతవరకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదనీవేదన చేసారు. దీనికి సానుకూలంగా స్పందించిన గంటా ఖచ్చితంగా కళింగ వైశ్యులకు రాజకీయ ప్రాదాన్యత కల్పిస్తానని హామీ ఇచ్చారు.
40ఏళ్ల అనుభవం చంద్రబాబుది…31 కేసుల్లో నిందితుడు జగన్ :
నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంగల చంద్రబాబు ఓవైపు, 31 కేసుల్లో నిందితుడిగా ఉండి 16 నెలలు జైలులో ఉన్న జగన్ ఓ వైపు ఎన్నికల్లో పోటీ పడడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని అన్నారు. విజ్ఞులైన ప్రజలు ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించేందుకు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు .ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి కాశీ విశ్వనాథం తో పాటు పెద్ద సంఖ్యలో కళింగ వైశ్య కులస్తులు పాల్గొన్నారు.
గంటాకు డాక్టర్లు మద్దతు:
మంత్రి గంటా శ్రీనివాసరావుకు డాక్టర్లు మద్దతు ప్రకటించారు. నగరంలోని ప్రముఖ డాక్టర్లు దసపల్లా హోటల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో గంటాకు తమ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్య వరప్రసాద్, డాక్టర్ సుధాకర్ తదితరులు మాట్లాడుతూ గంటా శ్రీనివాసరావు అందరికీ సుపరిచితుడని ఆయన వైద్యరంగానికి చేసిన సేవలు మరువలేనవన్నారు. వైద్యరంగం ఎదుర్కొం టున్న సమస్యలను గంటా శ్రీనివాసరావు కు వైద్యులు వివరించారు. వాటికి సానుకూలంగా స్పందించి త్వరలోనే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎంతో కషి చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్యరంగంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉత్తర నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైద్యులను కోరారు.


