ఇప్పటికే టీడీపీ గెలుపు మెజార్టీపైనే దృష్టంతా
- 10 Views
- admin
- April 7, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
టీడీపీ అధికారప్రతినిధి కాశీవిశ్వనాధం——————
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : ఇప్పటికే విశాఖ ఉత్తరంలో టీడీపీ గెలుపు ఖాయమైందని మెజా ర్టీపైనే తమ దృష్టంతాఅని టీడీపీ అధికారప్రతినిధి బొడ్డేడ కాశీ విశ్వనాధం తెలిపారు. ఆదివారం నర శింహనగర్లోని తన స్వగృహంలో మీడియా సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ బీజేపీ పార్టీలు ఖాళి అయిపోయాయన్నారు. వైసీపీ కిచెందిన వారు ్డప్రెసిడెంట్లు, ముఖ్యనాయకులు సుమారు 66మంది టీడీపీలో చేరారన్నారు. టీడీపీ అండతో నియోజక వర్గంలో గెలిచిన బీజేపీ అభ్యర్ధి విష్ణుకుమార్ రాజు గతం మరిచి అవాకులు, చవాకులు పేలడం సరికాద న్నారు. రాజుకి రాజకీయభిక్ష పెట్టింది గంటా శ్రీని వాసరావేనన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. విశాఖ ఉత్సవ్ సాక్షిగా టీడీపీలో టికెట్ తనకు కేటా యిస్తే పార్టీ మారిపోతానని గంటాను బ్రతిమలాడిన పెద్దమనిషి ఈరోజు గంటాని విమర్శించడం తగునా అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో బీజేపీ పూర్తిగా ఖాళీ అయిపోయిందని, ఎంఎల్ఏ తప్ప ఇంకెవ్వరూ మిగలలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని అడ్డుపెటు ్టకుని ఐటీ హభ్లో స్థలాలు ఆక్రమించి పెద్దపెద్ద భవనాలు కట్టుకున్నారన్నారు. నియోజకవర్గంలో బీజేపీ, వైసీపీల ఓటమి తప్పదని తెలిసిన అభ్యర్ధులి ద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం వలన మ్యాచ్‌ఫిక్సింగ్ కుదుర్చుకున్నారన్నారు. ఇద్దరు రాజులూ కలిసినా మంత్రిని ఏమీచెయ్యలేరన్నారు. ఇప్పటికే హౌసింగ్ స్కీంలో డీడీలు తీసిన లభ్ధిదారు లను భయపెట్టి ఎమ్మెల్యే ఓట్లు అడుగుతున్నారని తనకి ఓట్లు వెయ్యకపోతే ఇల్లులు ఆపేస్తానని బెదిరిం చడం సరికాదన్నారు. ఎంతమంది డీడీలు తీశారో వారందరికీ ఖచ్చితంగా ఇళ్ళు ఇచ్చే బాద్యత టీడీపీదేనని ఓటర్లెవ్వరూ బెదిరింపులకు భయ పడకుండా టీడీపీకి ఓటు వేసి మంత్రి గంటా శ్రీనివాసరావుని, ఎంపీ అభ్యర్ధి శ్రీభరత్‌ని గెలి పించాలన్నారు. వైసీపీ పార్టీ విలువలులేనిదని డబ్బున్నవారిని అభ్యర్ధిగా నిలబెట్టాలని గతంలో పనిచేసిన సమన్వయ కర్తలను వాడుకుని వదిలే శారన్నారు. గతంలో పనిచేసిన చొక్కాకుల వెం కట్రావు, పసుపులేటి ఉషా కిరణ్, తైనాల విజ యకుమార్ వంటి వారిని అప్పల పాలైపోయేలా చేసి బయటికి తోసేశారన్నారు. ఇప్పుడు కెకె రాజు వంతుకి వచ్చిందన్నారు. గత 15 సంవత్సరాలుగా ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులంతా నిశ్చేదంలో వున్నారని గంటారాకతో వారిలో ఆనందం ఉప్పొంగుతోందనానరు. గంటా ని గెలిపించుకుని టీడీపీ పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.వైసీపీ నేతలు తైనాల విజయ కుమార్, కళా హాస్పటల్ అధినేత డాక్టర్ రమణ మూర్తి టీడీపీలో చేరడం శుభ పరిణామ మన్నారు.


