పోలింగ్‌కు యంత్రాంగం సర్వం సిద్ధం
- 13 Views
- admin
- April 8, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
ఓటు వేయనున్న 35,78,458 మంది ఓటర్లు—————
—————-ఎపిక్‌కి బదులుగా 11 రకాల గుర్తింపు కార్డులు
విశాఖ ఏజెన్సీలో ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్——————-
————-మిగిలిన నియోజక వర్గాల్లో ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ శ్ర
గ్రేహౌండ్స్, సె ంట్రల్ పారా మిలిటరీ, స్టేట్ పోలీస్ ప్రత్యేక దళాలతో బందోబస్తు—————-
——————జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భాస్కర్ వెల్లడి.
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధం చేస్తోంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కాటమనేని భాస్కర్ అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఫొటో గుర్తింపు కార్డు లేని ఓటర్లు ఎన్నికల సంఘం నిర్ణయించబడిన 11 రకాల గుర్తింపు కార్డులతో తమ ఓటు హక్కును వినియోగిం చుకోవచ్చని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కె.భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా, పోలీస్ సూపరింటెండెంట్ ఎ.బాబూజీ తో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 11 వ తేదీన జరిగే సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 35,78,458 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే 3,38,586 ఎపిక్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని, మరో 80 వేల ఎపిక్ కార్డులు వచ్చాయని, వాటిని కూడా పంపిణీ చేస్తున్నామన్నారు.
ఎపిక్ కార్డు తమ వద్ద లేదని ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల గుర్తింపు కార్డులను వినియోగించుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు,ప్రభుత్వ రంగ, ప్రైవేటు కం పెనీల ఉద్యోగులు ఫొటోతో కూడిన సర్వీసు ఐడెంటిటీ కార్డు, ఫొటోతో కూడిన బ్యాంకు, పోస్టాఫీసు పాసబుక్, పాన్ కార్డు, ఎన్.ఆర్.పి.క్రింద ఆర్.జి.ఐ. చే జారీ చేయబడిన స్మార్టు కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖచే జారీచేయబడిన హెల్త్ ఇన్యూరెన్సు స్మార్టు కార్డు, ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, ఎం.పి., ఎమ్మేల్యేలకు జారీ చేయబడిన అఫీషియల్ ఐ.డి.కార్డు, ఆధార్ కార్డు ను గుర్తింపు కార్డులుగా నియోగించుకోవచ్చన్నారు. అయితే ఫొటో ఓటర్ స్లిప్ ఆధారంగా ఓటు వేసేందుకు అనుమతించరన్నారు. జిల్లా వ్యాప్తంగా నున్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందన్నారు. అరుకు, పాడేరు మినహా మిగిలిన నియోజక వర్గాల్లో ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందన్నారు. అయితే అరుకు, పాడేరు నియోజక వర్గాల్లో ఉదయం 7 నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ పోలింగ్ జరుగుతుందన్నారు.
పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర బడ్డా మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో శాంతి, భద్రతలు పటిష్టంగా అమలు పర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 333 కేసులకు సంబందించి 3,393 మందిని బైండోవర్ చేశామని, ఎం.సి.సి. అతిక్రమించినందుకు 64 కేసులను బుక్ చేశామని, 819 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మొత్తం 5 వేల 922 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు.
పోలీస్ సూపరింటెండెంట్ ఎ.బాబూజీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 2,207 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వాటిలో 256 సమస్యాత్మక, 83 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. అరుకు, పాడేరు నియోజక వర్గాల్లో 469 పోలింగ్ స్టేషన్లు ఎల్.డబ్ల్యు.ఇ. ప్రభావిత కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు. ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దుల్లో 43 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ఆంధ్రా, ఒడిస్సా పోలిస్ సహకారంతో ఈ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. గ్రేహౌండ్ , సెంట్రల్ పారామిలటరీ, స్టేట్ ప్రత్యేక దళాల సహకారంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్రోన్లను ఉపయోగిస్తూ పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.


