గెలిపిస్తే ప్రజల కన్నీరు తుడుస్తా.. ప్రచారంలో కొణతాల సీతారాం హామీ
- 14 Views
- admin
- April 8, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
అనకాపల్లి, ఫీచర్స్ ఇండియా : మిగిలిన అభ్యర్థుల మాదిరిగా ఓటు కోసం ప్రజల మధ్యకు వచ్చి దొంగ ఏడుపు ఏడవడం తనకు చేతకాదని,ఎఎమ్మెల్యేగా గెలి పిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల కన్నీరు తుడుస్తానని కొణతాల సీతారాం అన్నారు. కశింకోట మండలం సింగ వరం గ్రామంలో శనివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అశేష గ్రామ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అలాగే ఆదివారం ఉదయం రామాపురం కాలనీలో ఆయన నిర్వ హించిన ప్రచారానికి కూడా మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ పెందుర్తి నుంచి వలస వచ్చిన పీలా గోవిందు, గాజువాక నుంచి వలస వచ్చిన అమర్, గుంటూరు నుంచి వలస వచ్చిన పరుచూరి భాస్కరరావు చౌదరి ఏ అర్హతతో ఇక్కడ పోటీ చేస్తారో, వారికి ఎందుకు ఓటు వేయాలో ప్రజలే ఆలోచించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీలా గోవిందు ప్రచారానికి వెళ్తే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అడ్డుకుంటున్నారంటే అతను ఇంత వరకూ ఎంత బాగా పాలించాడో అర్ధం చేసుకోవచ్చన్నారు. అమర్ విషయా నికి వస్తే ఎన్నికలకు ఆరు నెలల ముందు అనకాపల్లి వచ్చి రెండు సార్లు ఇళ్లు, కార్యాలయాలు మార్చడం తప్ప మరేమీ చేయలేదన్నారు. జనసేన అభ్యర్థి భాస్కరరావు ప్రజలను అంగడి బొమ్మలుగా భావిస్తూ ఎక్కడో దోచు కున్న డబ్బును ఇక్కడ ఖర్చు పెట్టి రాజకీయం చేయాలను కోవడం అతని వ్యక్తిత్వానికి నిదర్శనమని విమర్శించారు. స్థానికతను కోల్పోతే భవిష్యత్తు కోల్పోయినట్టేనని చెప్పారు. ఎలాంటి అధికారం లేకుండానే నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని, ప్రజలు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అనకాపల్లి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తయారు చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఓటు కోసం ఎవరు ఎలాంటి తాయిలాలు ఇచ్చినా మొహమాటం లేకుండా తీసుకుని, పోలింగ్ రోజు ఓటు మాత్రం గ్యాస్ సిలిండర్ గుర్తు మీద వేసి స్థానిక నాయకత్వాన్ని గెలిపించాలని కోరారు. ఓడిపోతే వలస నాయకులు పారిపోతారని, కానీ తాను ఎప్పుడూ జనం కోసం జనం మధ్యనే ఉంటానని హామీ ఇచ్చారు.
ప్రజలు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి, మరోసారి రాజకీయ దొంగల చేతిలో దోపిడీకి గురికాకుండా ఉండేందుకు గ్యాస్ సిలిం డర్ గుర్తు మీద ఓటు వేసి తనను గెలిపించాలని సీతా రాం అభ్యర్థిం చారు. ఈ కార్యక్రమంలో షేక్ ఉమర్, దాడి బుజ్జి, ఉత్తాడ రామరాజు, కాండ్రేగుల సునీల్, సురభి హరీష్, గల్లా వినోద్, దాడి పరదేశినాయుడు, పామ్ పైడిరాజు, మారిశెట్టి శ్రీనివాసరావు, పండు గోవింద్, శ్యామ్ లాల్, రాజనాల శ్రీకాంత్, .ఐనాల నాయుడు, కోరుకొండ సురేష్, కోరుకొండ జగదీష్ , కాకినాడ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.


