జగన్ రాకతో వైకాపాలో ఫుల్ జోష్
- 10 Views
- admin
- April 8, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
గెలుపుపై ఆ పార్టీ వర్గాలలో ధీమా అధికార పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు———————–
విశాఖ రూరల్, ఫీచర్స్ ఇండియా : వైకాపా అధినేత వైఎస్ జగన్ రాకతో అనకాపల్లిలో ఆపార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో తమ గెలుపు ఖాయమనే నమ్మకంతో ఉన్న పార్టీ వర్గాలు తమ నాయకుడు జగన్ రాకతో ఇక ఎటువంటి సందేహాలు లేవనే ధీమా వ్యక్తం అవుతుంది. జగన్ తన ప్రసంగంలో స్ధానిక అధికారపార్టీ ఎమ్మెల్యే పీలా గోవిందపైనా, ఎంపీ అభ్యర్ధి ఆడారి ఆనంద్‌పైనా విమర్శలతో విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వచ్చాక విశాఖ డెయిరీ బాగోతాన్ని బట్టబయలు చేసి పాడి రైతులకు న్యాయం చేస్తానని చెబుతూ డెయిరీలో జరుగుతున్న మోసాలను తన ప్రసంగంలో చక్కగా ప్రజలకు వివరించారు. సహకార రంగంలోని డెయిరీని తన కుటుంబ ఆస్తిగా మార్చుకున్న వైనాన్ని వివరించారు. అలాగే తుమ్మపాల చక్కెర కర్మాగారం విషయంలో స్ధానిక ఎమ్మెల్యే ఇటు రైతులను, అటు కార్మికులను ఏ విధంగా మోసగించారో తన ప్రసంగంలో వివరించి ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రత్యర్ధులను విమర్శిస్తూనే తమ అభ్యర్ధి అమర్‌కు ఎటువంటి అవినీతి మరకలు లేనందున తప్పక గెలి పించాలని అభ్యర్ధించారు. జగన్ రోడ్ షోకు పెద్ద సంఖ్యలో ప్రజ లు మండుటెండను సైతం ఖాతర్ చేయకుండా హాజరు కావడం విశేషం. స్ధానిక సమస్యలపై జగన్ మాట్లాడుతున్నపుడు ప్రజల నుంచి హర్షధ్వానాలు వినిపించాయి. ముఖ్యంగా విశాఖ డెయిరీ పై ఆయన చేసిన విమర్శలు, డ్వాక్రా గూపు రుణాల విషయంలో మహిళలను చంద్రబాబు ఏ విధంగా మోసగిస్తున్నారో ఆయన సవివరంగా చెప్పినపుడు మహిళలు చప్పట్లుతో స్వాగతించారు. డ్వాక్రా రుణాలపై మహిళలు చెల్లిస్తున్న వడ్డీ ఎంత ? ప్రభుత్వం నుంచి మహిళలకు అందుతున్న సాయం ఎంత అన్నది కంఫేర్ చేస్తూ ఆయన చేసిన ప్రసంగానికి మంచి స్పందన కనిపించింది. నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీలో వర్గాలు, గ్రూపులు, అసమ్మతి, అవినీతి ఆరోపణలు ఉన్న నేపధ్యంలో ఇవి అమర్ గెలుపుకు దోహదం చేస్తాయని పార్టీవర్గాలు నమ్ముతున్న తరుణంలో జగన్ రాక పార్టీ వర్గాలలో ఫుల్ జోష్ నింపింది. ఇక గెలుపు తమదేననే ధీమా ఆ పార్టీ వర్గాలలో వ్యక్తం అవుతుంది.


