ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక బస్సులు
- 12 Views
- admin
- April 9, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
10 వ తేదీ ఉదయం పలు రూట్లలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు వెళ్లేందుకు బస్సుల ఏర్పాటు—————–
ఏజన్సీకి వెళ్లే బస్సులు ఉ.2.00 గం.లకు మిగిలిన ప్రాంతాలకు ఉ.4.00 గం.లకు—————-
కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి———– కె.భాస్కర్
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : ఈ నెల 11 వ తేదీన జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు 10 వ తేదీనే చేరుకునేందుకు బస్సులను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె.భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు అన్నీ 10 వ తేదీ తెల్లవారు జామున రెండు షిప్టుల్లో తొమ్మిది నిర్దేశిత ప్రాంతాల నుండి బయలు దేరతాయన్నారు. ఏజన్సీలోని పాడేరు, అరుకు ప్రాంతాలకు వెళ్లేందుకు, అక్కడ నుండి మైదాన ప్రాంతాలకు వచ్చే బస్సులు ఉదయం 2 గంటలకు బయలు దేరతాయని, మిగిన బస్సుల ఉదయం 4.00 గంటలకు బయలు దేరతాయని ఆయన తెలిపారు. ఎవరైనా ఈ బస్సులను మిస్ అయిపోతే, ఎన్నికల సిబ్బంది నియామక లేఖను చూపించి రెగ్యులర్ ఆర్ .టి.సి.బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆయన తెలిపారు.
10 వ తేదీ ఉదయం విశాఖపట్నం ద్వారకా బస్టాండు నుండి 15 బస్సులు బయలు దేరుతున్నాయని, వాటిలో అరుకు, పాడేరు వెళ్లే బస్సులు ఉదయం 2.00 గంటలకు, చోడవరం, మాడుగుల, పాయకరావు పేట(నక్కపల్లి) మరియు నర్సీపట్నంకు వెళ్లే బస్సులు ఉదయం 4.00 గంటలకు బయలు దేరతాయని ఆయన తెలిపారు. ఈ కేంద్రంలో బ స్టేషన్ ఇన్ చార్జి ఎం.వి.రావు (8555861431) అని, ఇతర వివరాలకు వీరిని సంప్రదించవచ్చన్నారు.
చోడవరం బస్టాండ్ నుండి 11 బస్సులు బయలు దేరుతున్నాయని, వాటిలో అరుకు, పాడేరు వెళ్లే బస్సులు ఉదయం 2.00 గంటలకు, విశాఖ సిటీకి, మాడుగుల, పాయకరావు పేట(నక్కపల్లి) మరియు నర్సీపట్నం వెళ్లే బస్సులు ఉదయం 4.00 గంటలకు బయలు దేరతాయన్నారు. ఈ కేంద్రంలో బస్‌స్టేషన్ ఇన్ చార్జి జి.వి.ఎస్. ఎస్.వి.రాజు (7382916842) అని ఆయన తెలిపారు.
మాడుగుల బస్టాండ్ నుండి 8 బస్సులు బయలు దేరుతున్నాయని, వాటిలో అరుకు, పాడేరు వెళ్లే బస్సులు ఉదయం 2.00 గంటలకు, విశాఖ సిటీకి, చోడవరం, పాయకరావు పేట(నక్కపల్లి) మరియు నర్సీపట్నం వెళ్లే బస్సులు ఉదయం 4.00 గంటలకు బయలు దేరతాయన్నారు. ఈ కేంద్రంలో బ స్టేషన్ ఇన్ చార్జి కె.ఎస్.నారాయణ (7382914023) అని ఆయన తెలిపారు. అరుకు తాసీల్దారు కార్యాలయం నుండి 22 బస్సులు బయలు దేరుతున్నాయని, వాటిలో విశాఖపట్నం సిటీ, పాయకరావు పేట(నక్కపల్లి), నర్సీపట్నం వెళ్లే బస్సులు ఉదయం 2.00 గంటలకు, చోడవరం, మాడుగుల, మరియు పాడేరు వెళ్లే బస్సులు ఉదయం 4.00 గంటలకు బయలు దేరతాయన్నారు. ఈ కేంద్రంలో బ స్టేషన్ ఇన్ చార్జి శామ్యుల్ (7382921721) అని ఆయన తెలిపారు. అదే విధంగా పాడేరు బస్టాండు నుండి 16 బస్సులు బయలు దేరుతున్నాయని, వాటిలో విశాఖపట్నం సిటీ, పాయకరావు పేట(నక్కపల్లి), నర్సీపట్నం వెళ్లే బస్సులు ఉదయం 2.00 గంటలకు, చోడవరం, మాడుగుల, మరియు అరుకు వెళ్లే బస్సులు ఉదయం 4.00 గంటలకు బయలు దేరతాయన్నారు. ఈ కేంద్రంలో బ స్టేషన్ ఇన్ చార్జి డి.అప్పారావు (7382914003) అని ఆయన తెలిపారు.
అనకాపల్లి బస్టాండ్ నుండి 10 బస్సులు బయలు దేరుతున్నాయని, వాటిలో అరుకు, పాడేరు వెళ్లే బస్సులు ఉదయం 2.00 గంటలకు, విశాఖ సిటీకి, చోడవరం, మాడుగుల, పాయకరావు పేట(నక్కపల్లి) మరియు నర్సీపట్నం వెళ్లే బస్సులు ఉదయం 4.00 గంటలకు బయలు దేరతాయన్నారు. ఈ కేంద్రంలో బ స్టేషన్ ఇన్ చార్జి కె.వి.స్వామి (7382913462) అని ఆయన తెలిపారు. యలమంచలి బస్టాండ్ నుండి 10 బస్సులు బయలు దేరుతున్నాయని, వాటిలో అరుకు, పాడేరు వెళ్లే బస్సులు ఉదయం 2.00 గంటలకు, విశాఖ సిటీకి, చోడవరం, మాడుగుల, పాయకరావు పేట(నక్కపల్లి) మరియు నర్సీపట్నం వెళ్లే బస్సులు ఉదయం 4.00 గంటలకు బయలు దేరతాయన్నారు. ఈ కేంద్రంలో బ స్టేషన్ ఇన్ చార్జి ఆర్.ఎస్.నాయుడు (7382918559) అని ఆయన తెలిపారు. పాయకరావు పేట బస్టాండ్ నుండి 8 బస్సులు బయలు దేరుతున్నాయని, వాటిలో అరుకు, పాడేరు వెళ్లే బస్సులు ఉదయం 2.00 గంటలకు, విశాఖ సిటీకి, చోడవరం, మాడుగుల మరియు నర్సీపట్నం వెళ్లే బస్సులు ఉదయం 4.00 గంటలకు బయలు దేరతాయన్నారు.
ఈ కేంద్రంలో బ స్టేషన్ ఇన్ చార్జి ఎస్.జి.దొర (7382915840) అని ఆయన తెలిపారు. నర్సీపట్నం బస్టాండ్ నుండి 13 బస్సులు బయలు దేరుతున్నాయని, వాటిలో అరుకు, పాడేరు వెళ్లే బస్సులు ఉదయం 2.00 గంటలకు, విశాఖ సిటీకి, చోడవరం, మాడుగుల మరియు పాయకరావు పేట(నక్కపల్లి) వెళ్లే బస్సులు ఉదయం 4.00 గంటలకు బయలు దేరతాయన్నారు. ఈ కేంద్రంలో బ స్టేషన్ ఇన్ చార్జి ఎ.గంగరాజు (7382917289) అని ఆయన తెలిపారు. ఎన్నికల సిబ్బంది అంతా బస్సు సౌకర్యాలను వినియోగించుకొని వారికి నిర్దేశించిన మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాని ఆయన విజ్ఞప్తి చేశారు.


