ఈవీఎం, వీవీ ప్యాట్లు రాండమేజేషన్ ప్రక్రియ పూర్తి
- 13 Views
- admin
- April 10, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్—————
విజయనగరం, ఫీచర్స్ ఇండియా : విజయనగరం పార్లమెంట్ కు సంబంధించిన వి.వి. ప్యాట్లు, ఇ.వి.ఎం. ల సప్లమెంటరీ రాండమైజేషన్ ప్రక్రియ విజయవంతమయ్యిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని జాతీయ సమాచార కేంద్రంలో ఇ.వి.ఎం, వి. వి. ప్యాట్ల రాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, ఇ.వి.ఎం ల నోడల్ అధికారి బి.శాంతి, వివిధ పార్టీల ప్రతినిధులతో కలసి పవర్ పాయింట్ ప్లెజెంటేషన్ ద్వారా పూర్తి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి రాజకీయపార్టీ నేతలు సహకరించాలన్నారు. ఎన్నికల కమీషన్ నియమనింబధనలు తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఇ.వి.ఎం.లు, వి.వి.ప్యాట్లు రాండమే జేషన్ ద్వారా పారదర్శకంగా ఎన్నికలు జరగడానికి వీలుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ. జె.వెంకటరావు, సి.పి.ఐ పార్టీ తరపున ఎస్. రంగరాజు, బి.ఎస్.పి. జిల్లా అధ్యక్షుడు పి.వి.రమణ, జనసేన ప్రతినిధి దీక్షిత తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎం. హరిజవహర్ లాల్
విజయనగరం, ఫీచర్స్ ఇండియా : సాధారణ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎం. హరిజవహర్ లాల్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట
పూర్తి చేశామని, ఎటువంటి లోపాలు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కల్గకుండా అవసరమైన ప్రత్యేక బలగాలను నియమించా మన్నారు.
ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం కల్గకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని, క్యూలైన్ నిర్వహణకు ఎన్.సి.సి., ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు, మాజీ సైనికులు సేవలను వినియోగిస్తున్నా మన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ప్రైవేటు సంస్థల సిబ్బంది సేవలను ఎన్నికలకు వినియోగిం చుకోవడం లేదన్నారు.
ఓటర్ స్లిప్పులు ఓటు పరిశీలించేందుకే కాని ఓటు వేసేందుకు అనుమతించరని ఈ విషయం ఓటర్లు అవగతం చేసుకోవాలన్నారు. ఎపిక్ కార్డు లేకపోతే ఎన్నికల సంఘం గుర్తించిన మరో 11 గుర్తింపు కార్డుల ద్వారా ఓటు వేసుకోవాలని ఆయన సూచించారు. 2 304 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.
ఎన్నికల సామాగ్రి తరలింపు
విజయనగరం, ఫీచర్స్ ఇండియా : సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్ లాల్ పేర్కొన్నారు. బుధవారం పి.టి.సి. కళాశాలలో విజయనగరం అసెంబ్లీ పరిధిలో ఉన్న ఎన్నికల సామాగ్రి తరలింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, విజయనగరం పార్లమెంటరీ జనరల్ అబ్జర్వర్ అరవింద్ కుమార్ వర్మ, జిల్లా ఎస్పీ దామోదర్ లతో కలసి పరిశీలించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జె.సి.వెంకటరమణారెడ్డి ఆ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎన్నికల సిబ్బందిని ఎన్నికల విధులకు సంబంధించిన సామాగ్రి అందిందో లేదో అడిగి తెలుసుకున్నారు. బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వి.వి. ప్యాట్లు, పోలింగ్ సామాగ్రి ఎన్నికల సిబ్బందికి అందిందో లేదో చూశారు. రూట్లు, పోలింగ్ కేంద్రాలు వారీగా పోలింగ్ సిబ్బందిని విభజించాలని ఆదేశించారు. ఎన్నికల కమీషన్ నియమనింబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు బుధవారం సాయంత్రమే ఎన్నికల సిబ్బంది వెల్లడం జరుగుతుందని తెలిపారు. టార్గెట్-90, విజయనగరం-90 లక్ష్యంగా ఓటింగ్ శాతాన్ని పెంచుతున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు మోనటరింగ్ సెల్ అధికారుల సహాయంతో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


