రామరాజ్యం రావాలి
- 11 Views
- admin
- April 10, 2019
- Home Slider తాజా వార్తలు యువత రాష్ట్రీయం స్థానికం
—————-తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్—————–
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: రామరాజ్యం కోరు కుంటారే తప్పా రావణరాజ్యం కోరుకోరని తెలుగుశక్తి అధ్యక్షులు బి.వి.రామ్ ప్రజలు తమ అమూల్యమైన ఓటు అందరూ వినియోగించుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. ఈవేళ జరుగుతున్న పోరాటంలో నీతికి – అవినీతికి, న్యాయానికి – అన్యాయానికి, ధర్మానికి – అధర్మానికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో నీతికి, న్యాయానికి, ధర్మానికి పాటుపడుతున్న వ్యక్తులను గెలిపించాలని ప్రజలకు మనవి చేశారు. ప్రజలను తెలుగుశక్తి కోరేదొకటే దయచేసి మనింట్లో శుభకార్యాలు చేసుకున్నప్పుడు ఎలాగైతే పదిమందిని పిలుస్తామో ఈ వేళ మీరందరూ ప్రజలను చైతన్యవంతం చేసి ఓటింగ్ శాతం (90%) జరిగేలాగా కృషి చేయాలని తెలుగుశక్తి అధ్యక్షులు బి.వి.రామ్ కోరారు.
నోటు కోసం ఓటు వేయకండి
మంచి ప్రతినిధి కోసం ఓటు వేద్దాం.
తెలుగుతల్లి సాక్షిగా నిలపెడదాం
ఈనాడు తెలుగువారి ఆత్మ గౌరవం!
స్వతంత్య్ర పోరాటం కోసం ఆనాడు ప్రజలు స్వాతంత్య్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల, మత, వర్గ, వర్ణ విబేధాలు పోవాలని, అంటరానితనం నిర్మూలించాలని ఎలాగైతే పోరాడారో ఈనాడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపథంలో నడవాలంటే సమర్థవంతమైన నాయకులను ఎన్నుకొంటే మనమందరం ముందు తరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చినవాళ్లమవుతామని పేర్కొన్నారు.


