వర్షాకాలంలో చిన్న జాగ్రత్తలతో అనారోగ్యాల నివారణ
వర్షాకాలమంటే మనకు చిన్నప్పట్నుంచే ఎంతో ఇష్టంగా ఉంటుంది. చల్లగా చినుకులు పడుతుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి వర్షాకాలంలో రోగులబారిన పడడం కూడా సాధారణ విషయమే. అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో వైరస్ మరియు బాక్టీరియాలనుండి మనల్ని కాపాడుకుంటూ ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించండి. ఈ వర్ష కాలంలో ఫిల్టర్ చేసిన మరియు బాయిల్డ్ చేసిన వాటర్ ను మాత్రమే త్రాగటానికి ఉపయోగించాలి. మీరు సాదారణంగా ఈ కాలంలో క్రిముల దాడి నుండి తప్పించుకోవటానికి టీ లేదా అల్లం టీ, నిమ్మకాయ టీ,వేడి కూరగాయల సూప్,మూలికా టీ వంటి వాటిని త్రాగటానికి ఇష్టపడుతారు. కాలంలో పూర్తిగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా పచ్చి లేదా వండని ఆహారపు అలవాట్లు ఉంటే మీకు మీరే సమస్యలను ఆహ్వానిస్తున్నట్లే. వర్షాకాలం సమయంలో మన శరీరంనకు త్వరగా ఆహారం జీర్ణం చేయడానికి కష్టతరంగా ఉంటుంది. అందువల్ల మీ జీర్ణక్రియ మెరుగు పర్చే క్రమంలో వెల్లుల్లి, మిరియాలు, అల్లం, పసుపు మరియు కొత్తిమీర వంటి ఆహారాలను తీసుకోవాలి. ఈపండ్లు -కూరగాయలు: గరం-గరం బజ్జీలకు బదులుగా తాజాగా వండిన లేదా తాజా పండ్లు మరియు కూరగాయలను తీసుకోవటం అలవాటు చేసుకోవాలి. పండ్లు మరియు కూరగాయలు, ముఖ్యంగా ఆకు కూరలు తినే ముందు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే వాటిమీద అనేక లార్వాలు , దుమ్ము మరియు పురుగులు ఉంటాయి. వీటిని తొలగించుట కొరకు ఉప్పు నీటిలో 10 నిముషాలు ఉంచాలి. ఇలా చేయుట వలన బాక్టీరియా నిరోధం జరుగుతుంది.


