విశాఖ ఉక్కు కోసం టీడీపీ ఉద్యమం
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వెనుక వైఎస్సార్సీపీ హస్తం ఉందని నారా లోకేష్ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకొచ్చి.. దాన్ని విక్రయిచే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ఒత్తిళ్లతోనే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడానికి అంగీకరించిందని అన్నారు. వారే ఒత్తిడి తెచ్చి.. వారే మళ్లీ దాన్ని అడ్డుకుంటున్నట్లు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దౌర్జన్యాలు పెచ్చరిల్లిపోయాయని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.విమర్శించారు. ఫోన్లు చేసి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిందని, అధికార దుర్వినియోగం చేసిందంటూ నారా లోకేష్ ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సష్టించినప్పటికీ.. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని చెప్పారు.విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరిం చబోమని నారా లోకేష్ తేల్చి చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పటికే తమ పార్టీ నాయకుడు పల్లా శ్రీనివాస్ విశాఖపట్నంలో దీక్షకు కూర్చున్నారని గుర్తు చేశారు. వందలాది మంది విశాఖపట్నం ప్రజలు ఆయనకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. మున్ముందు మరింత ఉద్యమిప్తామని ఆయన హెచ్చరించారు.


