ఇండియా పాక్ మధ్య మళ్లీ క్రికెట్
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ 2012-13 తర్వాత నుంచి ఇరు దేశాలు ద్వైపాక్షిక సిరీస్లు ఆడడం లేదు. అయితే త్వరలోనే భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగబోతోందట. ఈ ఏడాదిలోనే పాక్ జట్టు భారత్లో పర్యటించబోతోందట. ఈ ఏడాదిలో భారత్తో ద్వైపాక్షిక సిరీస్కు సన్నద్ధంగా ఉండాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందట. ఈ మేరకు పాక్ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది. ఈ ఏడాది ద్వితియార్ధంలో భారత్-పాక్ మధ్య ఓ టీ-20 సిరీస్ జరగబోతోందట. ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఇరు దేశాల ప్రేక్షకులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులందరూ ఆసక్తి కనబరుస్తారు. దాయాది దేశాల పోరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే కొంత కాలంగా ఇరు దేశాలూ ఐసీసీ టోర్నమెంట్లలో తప్ప ద్వైపాక్షిక సిరీస్లు ఆడడం మానేశాయి.
Categories

Recent Posts

