రుచికరమైన డ్రై చిల్లీ ఎగ్ కూర తయారీ
కావలసిన పదార్థములు : ఉడకబెట్టిన గుడ్లు : 8, మైదా : 50 గ్రా, పెప్పర్ పౌడర్ : 1 టీ స్పూన్, ఉప్పు : తగినంత, నూనె : తగినంత, పచ్చిమిచ్చి : 10, కార్న్‌ఫ్లోర్ : 50 గ్రా, టేస్టింగ్ సాల్ట్ : 1/2 టీ స్పూన్, సోయాబీన్ సాస్ : 1 టీ స్పూన్
తయారు చేయు విధానం : పచ్చిమిర్చి, ఉడికించిన గుడ్లను చిన్న ముక్కలుగా తరిగి, దానిలో పెప్పర్, సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, సోయాబీన్సాస్, కార్న్‌ఫ్లోర్, మైదా కలిపి, కొంచెం నీరు పోసి ముద్దగా చేయవలెను. కళాయిలో నూనె పోసి సిద్దముగా ఉంచుకొన్న ముద్దను చిన్న చిన్న ముద్దలుగా (పకోడి మాదిరిగా) నూనెలో వేయించి తీయవలెను. దీన్ని ‘టమోట సాస్’తో వడ్డించవచ్చు.
Categories

Recent Posts

