ఐపీఎల్ వాయిదా !
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్-2021)ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిచారు. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధ్రువీకరించారు. కాగా, ఇప్పటికే కోల్‌కతా ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కు కరోనా సోకడంతో సోమవారం జరగాల్సిన కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఈ క్రమంలో తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, ఢల్లీి క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అమిత్ మిశ్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో బయో బబుల్‌లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో టోర్నీ నిర్వహణపై సందిగ్దత నెకొనగా.. నిరవధికంగా వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. 8 ఫ్రాంఛైజీు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాయి.
Categories

Recent Posts

