పవర్ స్టార్ త్రిపాత్రభినయం
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి క్రిష్ డైరెక్షన్లో వీరమల్లు సినిమా. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా ఈసినిమాలో పవన్‌కల్యాణ్ కెరీర్లో తొలిసారి త్రిపాత్రాభియనం చేస్తున్నట్లు తెలుస్తోంది. చారిత్రాత్మక నేపథ్యంలో నిర్మితమౌతున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ను మూడు విభిన్న పాత్రల్లో దర్శకుడు చూపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కి ఈ సినిమా రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది.
Categories

Recent Posts

