ఏపీలో నాసిరకం మద్యంపై కేంద్రమంత్రికి ఫిర్యాదు
ఏపీలో నాసిరకం మద్యంపై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశానన్నారు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అన్ని శాంపిల్స్‌ను టెస్ట్ చేయాలని చెప్పానని.. కేంద్రం ఎప్పుడు శాంపిల్స్ తీస్తుందో చూడాలన్నారు. ఇండియాలో ఎక్కడా ఏపీలో ఉన్న ఈ బ్రాండ్లు లేవని.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల వారం నుంచి కనిపించడం లేదని.. ఏమైందో తెలియడం లేదన్నారు. ఆయన రెండు పదవుల్లో ఒక్క పదవే ఉండాలని వేసిన కేసు ఈ వారం విచారణకు వస్తుందన్నారు. ఇక మంత్రి అవంతి శ్రీనివాస్ ఆడియో వ్యవహారంలో విచారణ జరిపిస్తామని ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించడాన్ని ఆహ్వానించారు. తమ పార్టీ పరువును కాపాడటానికి ఇది ఓ అవకాశమని వ్యాఖ్యానించారు. ఆ మిమిక్రీ ఆర్టిస్టులు ఎవరో తేల్చాలని కోరుకుంటున్నాను అన్నారు.
Categories

Recent Posts

