ఆఫ్ఘాన్‌లో ముప్పు ఉంటే తెలపాలి
- 36 Views
- admin
- August 30, 2021
- అంతర్జాతీయం జాతీయం స్థానికం
‘ఆఫ్ఘనిస్థాన్‌లో ఏదైనా తీవ్ర ముప్పు ఉంటే మాకు తెలియజేయాలి. అంతేతప్ప ఏకపక్షంగా దాడులు చేయడం తగదని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కాబూల్ ఎయిర్ పోర్టుపై దాడికి యత్నించిన ఆత్మాహుతి దళ సభ్యుడిని అమెరికా బలగాలు నిన్న డ్రోన్ దాడిలో తుదముట్టించాయి. ఈ ఘటనలో సామాన్య పౌరులు కూడా చనిపోయారని జబీహుల్లా ముజాహిద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అధికారిక మీడియా సంస్థ సీజీటీఎన్కు పంపిన లిఖితపూర్వక స్పందనలో జబీహుల్లా ముజాహిద్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా దాడిలో ఏడుగురు చనిపోయినట్టు వెల్లడిరచారు. అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, దాడిపై తమకు ముందస్తు సమాచారం అందించలేదని జబీహుల్లా ముజాహిద్ తీవ్రస్థాయిలో స్పందించారు. పరాయిగడ్డపై అమెరికా బలగాలు ఈ విధమైన దాడులకు పాల్పడడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
Categories

Recent Posts

