పంజ్‌షీర్ తాలిబన్లు ఆక్రమించుకోలేదు
- 20 Views
- admin
- September 6, 2021
- అంతర్జాతీయం జాతీయం స్థానికం
పంజ్ షీర్ ప్రాంతం తాలిబన్ల వశమైందన్న ప్రచారంలో నిజంలేదని ఎన్ఆర్ఎఫ్ (నేషనల్ రెసిస్టెంట్ ఫ్రంట్-ఎన్ఆర్ఎఫ్) వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆడియో సందేశం పోస్టు చేశారు. అంతకుముందు తాలిబన్ల ప్రకటన వెలువడిన వెంటనే ప్రతి ఘటన దళాల (నేషనల్ రెసిస్టెంట్ ఫ్రంట్-ఎన్ఆర్ఎఫ్) ప్రతినిధి అలీ నజారీ స్పందించారు. తమ నాయకుడు అహ్మద్ మసూద్ క్షేమంగా ఉన్నారని వెల్లడిరచారు. పంజ్ షీర్ లోని అన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో తమ దళాలు కొనసాగుతున్నాయని వెల్లడిరచారు. పంజ్ షీర్ ప్రాంతం మొత్తం ఇప్పుడు తమ అధీనంలోకి వచ్చేసిందని తాలిబన్లు ప్రకటించుకున్న నేపథ్యంలో, ప్రతిఘటన దళాల అధిపతి అహ్మద్ మసూద్ స్పందించారు. తామింకా పంజ్ షీర్ లోనే ఉన్నామని, తాలిబన్లపై పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు.
Categories

Recent Posts

