జగన్కు తొత్తులుగా వ్యవహరించడాన్ని పోలీసులు మానుకోవాలి
సీఎం జగన్కు తొత్తులుగా వ్యవహరించడాన్ని పోలీసులు మానుకోవాలని… లేకపోతే ప్రజలు ఏదో ఒకరోజు తిరగబడతారని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమయిందని అన్నారు. డీజీపీ సహా చాలా మంది పోలీసు అధికారులు వైసీపీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రమ్య హత్య ఘటన జరిగి 21 రోజులు అయినా ఇంత వరకు న్యాయం జరగలేదని దుయ్యబట్టారు. దిశ చట్టం ద్వారా ఇప్పటి వరకు ముగ్గురికి ఉరిశిక్ష పడేలా చేశామని రాష్ట్ర హోంమంత్రి సుచరిత తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
Categories

Recent Posts

