ఎన్టీఆర్ హీరోయిన్‌పై దాడి
ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్‌తో నటించిన పాయల్ఘోష్పై దాడి జరిగింది. ఈమేరకు ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె తన కారులోకి వెళ్తుండగా కొంతమంది మాస్క్ ధరించిన వ్యక్తులు రాడ్‌తో దాడి చేశారని, వారి చేతిలో బాటిల్ కూడా ఉందని, అది యాసిడ్ అని తాను భావించినట్లు పాయల్ చెప్పింది. అయితే ఈ దాడి నుంచి తను తప్పించుకున్నట్లు, కానీ ఎడమ చేతికి స్వల్పంగా గాయం అయ్యినట్లు పేర్కొంది. దాడి జరుగుతున్న సమయంలో తాను గట్టిగా అరవడంతో వారు అక్కడి నుంచి పారిపోయారని తెలిపింది. ఇలాంటి సంఘటన తన జీవితంలో ఎప్పుడూ జరగలేదని ఇదే మొదటిసారని పాయల్ చెప్పుకొచ్చింది. ఈ అంశంపై పోలీసు కేసు నమోదు చేయ నున్నట్లు నటి వెల్లడిరచింది. కాగా ఈ దాడికి సంబంధించి ఎవరినైనా అనుమానిస్తున్నారా అనే దానిపై మాట్లాడుతూ పాయల్ ఇలా చెప్పింది.. స్పష్టంగా, తెలిసిన వాళ్లు కాదు కానీ ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది. కాగా గతంలో సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది నటి పాయల్ ఘోష్.


