అక్కడ చంద్రబాబు గెలిస్తే .. రాజకీయ సన్యాసం
కుప్పంలో చంద్రబాబుకు ఓటమి ఖాయమని, ఒకవేళ చంద్రబాబు కుప్పంలో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని మంత్రి కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. జగన్ ను ప్రజలు దీవిస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని కొడాలి నాని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు దొరికే పరిస్థితి ఉండదని అన్నారు. ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జడ్పీటీసీల్లో 99 శాతం, ఎంపీటీసీల్లో 85 శాతం వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారని వెల్లడిరచారు. కుప్పం, నారావారిపల్లె, నిమ్మకూరులోనూ వైసీపీదే విజయం అని స్పష్టం చేశారు.
Categories

Recent Posts

