మహిళ ప్రశ్నకు సిగ్గుపడ్డ సీఎం
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పరిపాలనలో ప్రజల మెప్పుతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కాగా ఆయన వయసు 68 సంవత్సరాలు. కానీ ఆయన అలా కనిపించరు. ప్రతిరోజూ ఫిట్నెస్ కోసం ఆయన జిమ్‌కు వెళ్తుంటారు. అయితే అనుకొని విధంగా ఓ మహిళ అడిగిన ప్రశ్నకు స్టాలిన్ సిగ్గుపడిపోయారు. వివరాల్లోకి వెళితే క్రమం తప్పకుండా మార్నింగ్ వాక్ చేస్తుంటారు స్టాలిన్. ఎప్పట్లాగానే మార్నింగ్ వాక్కు వెళ్లిన సీఎం స్టాలిన్ ఓ మహిళ అడిగిన ప్రశ్నతో కాస్త సిగ్గుపడ్డారు. మీరు చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు… మీ ఆరోగ్య రహస్యం ఏమిటి? అని ఆమె అడిగింది. దాంతో అక్కడున్న వారందరూ ఫక్కున నవ్వారు. దాంతో కొంచెం ఇబ్బందిగా ఫీలైన స్టాలిన్ తాను కూడా వారితో కలిసి నవ్వేశారు. ఆపై ఆమెకు బదులిస్తూ, డైట్ కంట్రోల్ వల్లే తానింత ఫిట్ గా ఉన్నానని తెలిపారు.
Categories

Recent Posts

