శివసేన రెబెల్ ఎమ్మెల్యేల కొత్త పార్టీ
- 33 Views
- admin
- June 25, 2022
- జాతీయం తాజా వార్తలు
ఏక్ నాథ్ షిండే నాయకత్వం వహిస్తున్న రెబెల్ ఎమ్మెల్యేలు కొత్త పార్టీని ప్రకటించారు. తమ గ్రూపుకు ‘శివసేన బాలాసాహెబ్’ అనే పేరు పెట్టినట్టు రెబెల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్కార్ తెలిపారు. ఇప్పటి నుంచి తమ గ్రూపు శివసేన బాలాసాహెబ్ పేరుతో పిలవబడుతుందని ఆయన తెలిపారు. ఏ పార్టీలో కూడా తాము కలవబోమని చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో, రెబెల్ ఎమ్మెల్యేలు ఇక శివసేన గూటికి చేరే అవకాశాలు లేవనే విషయం అర్థమవుతోంది. చివరకు శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.
Categories

Recent Posts

