2050 నాటికి ప్రపంచంలోనే ఏపీ అగ్రగామి: చంద్రబాబు
- 81 Views
- wadminw
- October 12, 2016
- అంతర్జాతీయం
విజయవాడ, అక్టోబర్ 12 (న్యూస్టైమ్): రాష్ట్రాన్ని 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిపేందుకు అభివృద్ధి దిశలో చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు, పెటుబడులకు స్వర్గధామమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ది చర్యలలో భాగంగా ఇక్కడ పరిశ్రమలు స్థాపించే వారికి రాబోయే 34 దశాబ్దాల పాటు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ముఖ్యమంత్రి అన్నారు.
అందుకు అనుగుణంగానే కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బుధవారం స్థానిక బందరురోడులోని ప్రైవెట్ సమావేశ మందిరంలో రష్యా ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులతో అవగాహన ఒప్పందాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎ.పి.ఇ.డి.వి.తో టెక్నోనికల్ కార్పొరేషన్, సన్గ్రూప్తోను, ఎ.పి.ఇ.డి.బి. కె.ఎస్.సి. యునైటెడ్షిప్ బిల్డింగ్ కార్పొరేషన్తోను అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారతదేశానికి రష్యాతో విడదీయరాన్ని అనుబంధం ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణంలో రష్యా తమ వంతు సహాయసహాకారాలను కొనసాగించాలన్నారు.
ప్రపంచీకరణ నేపధ్యంలో రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయని వ్యవసాయం, ఇన్మర్మేషన్ టెక్నాలజీ, అగ్రీ, ఆహారం, ఆటోమొబైల్, బయో టెక్నాలజీ, ఎనర్జీ పెట్రోల్ తదితర రంగాలలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో అపారమైన సహజవనరులు, ఖనిజాల లభ్యత మెరుగైన స్థితిలో ఉందన్నారు. కరెంట్, నీటి సమస్యలేదని వ్యాపారానికి అనుకూలమైన ప్రాంతమని, రాష్ట్రంలో సూదీర్ఘమైన తీర ప్రాంతం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖపట్నం-చెన్నై బెంగుళూరు-చెన్నై కారిడారు రాష్ట్రానికి అందుబాటులో ఉన్నాయన్నారు.
వ్యాపారాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలమైన ప్రాంతం అని, ప్రభుత్వ కోరికను మన్నించి రాష్ట్రంలో పెట్టబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల, వ్యాపార రష్యన్ ఫెడరేషన్ మంత్రి డెనిస్మ్యాన్ టోరన్కు సీఎం ధన్యవాదాలు తెలిపారు. వారితో పాటు వ్యాపార ప్రతినిధులు కూడా తీసుకురావడం పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అటు భారతదేశంలోను, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను రాజకీయ స్థిరత్వం ఉందని ఎటువంటి అపోహలకు తావులేదని, పెట్టబడులకు ఆహ్వానిస్తున్నామన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో ఇండియా జి.డి.పి. రేటు 7.3 శాతం ఉందని, అదే ఆంధ్రప్రదేశ్ 12.28 శాతం ఉన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాబోయే 20 సంవత్సరాలలో ఏపీ నుంచి 20 శాతం మేర రేటు వృద్ధికి ప్రణాళికలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని 2020 వాటికి దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాలో ఒకటిగాను, 2029 నాటికి దేశంలోనే ఆగ్రగామి రాష్ట్రంగాను, 2050 వాటికి ప్రపంచంలోనే రాష్ట్రాన్ని ఉత్తమ గమ్యం గల రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలను అమలు చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా విధానంలో సాంకేతికపరమైన పరిపాలనను అందిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో బకింగ్హోమ్ కెవాల్ ద్వారా అంతర్గత జలరవాణా దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టడానికి, అలాగే సాంకేతికపరమైన సూచనలను, సలహాలను అమలు పరచడానికి రష్యా పూర్తి సహాయసహాకారాలు అందించడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి కోరారు. రష్యాదేశానికి ఈ ప్రాంతానికి టీ, టోబాకో పరిశ్రమల పారిశ్రామిక అనుబంధం ఎన్నో ఎళ్ళగా కొనసాగుతోందన్నారు. పరిశ్రమల, వ్యాపార రష్యన్ ఫెడరేషన్ మంత్రి డెనిస్మ్యాన్ టోరన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, ఇతర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులతో సమగ్రంగా అశావహ దృక్పధంతో సహృదయ వాతావరణంలో చర్చించడం జరిగిందన్నారు.
ఇరువురికి లాభదాయకంగా ఉండేందుకు ఇక్కడ పరిస్థితులు చర్చల్లో భాగంగా ముఖ్యమైన ఆంశాలపై చర్చించామన్నారు. బొంబాయిలో ఐదు సంవత్సరాల పాటు పనిచేశానని, మహారాష్ట్ర వాటర్ స్పోర్ట్స్ రంగంలో విజేతగా నిలిచానని టోరన్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టబడులు పెట్టడానికి, సాంకేతికపరమైన అంశాలలో సహాయసహకారాలు అందించడానికి సిద్దంగా ఉన్నామన్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాయకత్వంలో కలసి రష్యా ప్రభుత్వం పనిచేయడం జరిగిందన్నారు. సాంకేతికపరమైన పనులను సమర్ధవంతంగా పరిపాలన చేపట్టడంలో ముఖ్యమంత్రి సమర్థవంతమైన నాయకుడిగా ఆయన తెలిపారు.
ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించేందుకు సిద్దంగా ఉన్నామని, అందుకోసం ఈ ప్రాంతంలో పర్యటించడం ద్వారా స్థితిగతులపై అంచనాకు రావడంతో పాటు మరిన్ని పరిశ్రమలను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో రష్యా కౌన్సిల్ జనరల్ సెర్డికోటోవ్, రాష్ట్ర మంత్రులు యనమలరామకృష్ణుడు, ఆర్.కిషోర్ బాబు, పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు, బిజినెస్ రష్యా ఆధ్యకులు రిపిక్ ఎలెక్స్, యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ ఆధ్యకులు ఆలెక్స్ రాక్ మానోవ్, టెక్నోనికోల్ మేనేజింగ్ డైరెక్టర్ సెర్టిజోలిస్నికోన్, రోస్టెక్ ఆధ్యరులు విక్టర్ క్లాడోచ్, రష్యా డెలిగేషన్ ప్రతినిధులు, ఇండియా పారిశ్రామికవేత్తల బృందం, ఆధికారులు పాల్గొన్నారు.


