3.21 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు
కాకినాడ, సెప్టెంబర్ 14 (న్యూస్టైమ్): గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కాటన్బ్యారేజ్ వద్ద మంగళవారం నీటి ఉధృతి మరింత పెరిగింది. దీంతో మిగులు జలాల విడుదలను పెంచారు. బ్యారేజ్ నుంచి మంగళవారం 3,21,904 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టాలకు సంబంధించి తూర్పు డెల్టాకు 3,600 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2,200 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద 10 అడుగుల నీటిమట్టం ఉంది.
ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 7.10 మీటర్లు, పేరూరులో 9.62 మీటర్లు, దుమ్ముగూడెంలో 8.57 మీటర్లు, భద్రాచలంలో 29.20 అడుగులు, కూనవరంలో 10.70 మీటర్లు, కుంటలో 7.85 మీటర్లు, కొయిదాలో 14.04 మీటర్లు, పోలవరంలో 9.45 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జ్ వద్ద 14.96 నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.
Categories

Recent Posts

