8న హైదరాబాద్‌లో మహా బతుకమ్మ
ఖమ్మం, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): బతుకమ్మ సంబరాలలో భాగంగా ఈ నెల 8వ తేదీన మహా బతుకమ్మను సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్నందున మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ డి.యస్.లోకేష్‌కుమార్ కోరారు. బతుకమ్మ పండుగను అంతర్జాతీయ స్థాయికి తీసుకొని పోయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినందున మహిళల పండుగ బతుకమ్మ కాబట్టి ప్రతి ఒక్క మహిళ హాజరయ్యే విధంగా తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని స్వచ్ఛందంగా రావాలని కలెక్టర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున హైద్రాబాదు లాల్ బహదూర్ స్టేడియంలో 10 వేల మంది హైద్రాబాదు నగర మహిళలతో మహబతుకమ్మ నిర్వహిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలో మహబతుకమ్మను నిర్వహిస్తున్నందున అన్ని జిల్లాలకంటే ఖమ్మం జిల్లాకు మహబతుకమ్మ నిర్వహణ కీర్తి ప్రతిష్టలు ఎక్కువని కలెక్టర్ అన్నారు. ఈ నెల 8వ తేదీన మహ బతుకమ్మ ఉత్పవంలో భాగంగా ఈ నెల 6, 7 తేదీలలో రిహర్సల్ ఉన్నందున అందులో పాల్గొనాలని ఆయన కోరారు. సర్గార్ పటేల్ స్టేడియంలో పెద్ద బతుకమ్మను జిల్లా యంత్రాంగంమే ఏర్పాటు చేస్తుందని, మహిళలందరు తప్పనిసరిగా పాల్గొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు. ఈ నెల 8న జరుగే మహా బతుకమ్మ ఆరోొజు సాయంత్రం 5.00 గంటలకు ప్రారంభమై 5.45 గంటలకు ముగుస్తుందని. ఈ మహా బతుకమ్మలో పాల్గొనే ఆసక్తి గల మహిళలందర ఆరోజు 3.00 గంటల మహాబతుకమ్మ కోసం ఏర్పాటు చేసిన సర్కిళ్లలో నిలబడి బతుకమ్మ ఆడాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
మహా బతుకమ్మ కోసం సర్గార్ పటేల్ స్టేడియంలో స్వయం సహాయక సంఘాలు, తయారు చేసిన వస్తువులు స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, ప్రభుత్వ శాఖల తరుపున ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల, జిల్లాలో జరిగిన బతుకమ్మపై ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటుతో పాటుగా బాణాసంచా కాల్చడం ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మను పండుగ ప్రాముఖ్యత, సాంప్రదాయాలను తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో మహిళలు తీపి గుర్తుగా భవిష్యత్తు తరాల వారికి సంస్కృతీ సాంప్రదాయాల కొనసాగింపులో ఆదర్శ ప్రాయులుగా ఉంటారని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అన్నారు. ఇదిలావుండగా, ఎన్నో కష్టాలకోర్చి పంటలు సాగచేస్తూ అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు రుణమాఫీ చేయకుండా సీఎం కేసీఆర్ బతుకమ్మ పండగకు మాత్రం వంద కోట్లు ఖర్చు చేస్తున్నారని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి విమర్శించారు.
బీరోలు, కాకరవాయి శివారు మంగళిబండ తండాలలో రూ.10 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభలలో ఎంపీ రేణుకాచౌదరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తన కూతురు, కొడుకు కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ కోసం కలలు కన్న ప్రజలు, విద్యార్థులను పట్టించుకొకుండా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. తన కుటుంబానికి కమీషన్ల రూపంలో వేల కోట్ల రూపాయలు సంపాదించేందుకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకంలో కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు.


