9775 లీటర్ల రేషన్ కిరోసిన్ పట్టివేత
- 89 Views
- wadminw
- September 6, 2016
- తాజా వార్తలు
ఏలూరు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): రేషన్ దుకాణాలకు అందించాల్సిన కిరోసిన్ అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం… నగరానికి చెందిన కె.చక్రధర్ అనే వ్యాపారి స్థానిక రైల్వేస్టే షన్ సమీపంలో కేవీఆర్ సుబ్బారావు డిపో అనే పేరున కిరోసిన్ వ్యాపారం చేస్తున్నారు. ఈ డిపో ద్వారా ప్రభుత్వ చౌక డిపోలకు కిరోసిన్ సరఫరా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో డిపో నుంచి బ్లాక్ మార్కెట్‌కు భారీ మొత్తంలో కిరోసిన్ తరలిపోతుందని సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు నిన్న అర్ధరాత్రి సమయంలో ఆకస్మికంగా దాడి చేశారు. గుట్టుచప్పుడు కాకుండా ట్యాంకర్లో తలిస్తున్న 9,775 లీటర్ల కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిపో యజమాని చక్రధర్‌తో పాటు ఇద్దరు గుమస్తాలపై కేసు నమోదు చేశామని సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. విజిలెన్స్ ఏవో శ్రీనివాస్, ఏసీటీవో, డీడీ రాజేంద్రప్రసాద్ దాడుల్లో పాల్గొన్నారు.
ఏలూరు నగరంలో డిజిటల్ ప్రచార బోర్డులు
ఏలూరు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ఏలూరు నగరంలో మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో త్వరలో రెండు డిజిటల్ ప్రచార బోర్డులు ప్రధాన సెంటర్లలో ఏర్పాటుచేయనున్నట్లు ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి చెప్పారు. స్ధానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏలూరు అధ్యక్షులు వీరబాబు బడేటి బుజ్జికి వినతిపత్రం సమర్పిస్తూ ప్రత్యేక హోదాకోసం పవన్ కళ్యాణ్ ప్రచార ఫ్లెక్సీలను నగరంలో తొలగించారని, వాటిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై బడేటి బుజ్జి మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఎవరైనా ఫ్లెక్సీలు గానీ, వాల్ పోస్టర్లు గానీ, బేనర్లు గానీ ఏర్పాటు చేసుకోవచ్చునని, అయితే మూడు రోజులు తర్వాత వాటిని తొలగించాలని కార్పోరేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అందులో భాగంగా తొలగించి ఉంటారని, తక్షణమే ప్రత్యేక హోదాకోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషిలో ఈఫ్లెక్సీలను తొలగించవద్దని, తొలగించినవాటిని పునరుద్ధరించాలని కమిషనరు యర్రా సాయి శ్రీకాంత్‌ను ఫోన్లో కోరామని బడేటి బుజ్జి చెప్పారు. మూడురోజులు వరకూ పార్టీకతీతంగా ఏవ్యక్తులైనా ఫ్లెక్సీలు, బేనర్లు ఏర్పాటు చేసుకుంటే కార్పోరేషన్ ఉచితంగా అనుమతి ఇవ్వడం జరుగుతుందని మూడు రోజులు తర్వాత ఆబేనర్లు, ఫ్లెక్సీలుంచాలంటే తగిన రుసుం కార్పోరేషన్‌కు చెల్లించాల్సి ఉంటుంది బడేటి బుజ్జి చెప్పారు. విశాఖ, కాకినాడ, విజయవాడ వంటి నగరాలలో ఉన్న మాదిరిగా ఏలూరులో కూడా ప్రయోగాత్మకంగా రెండు డిజిటల్ ప్రచార బోర్డులు ఏర్పాటు చేస్తామని తగిన రుసుం చెల్లించి ఈ బోర్డుల ద్వారా తగిన ప్రచారాన్ని ఎవరైనా సాగించవచ్చుకోవచ్చునని, ఈ మేరకు రెండు ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేస్తామని, డిమాండ్‌ను బట్టి ప్రధాన సెంటర్లలో విస్తరిస్తామని దీనివలన కార్పోరేషన్‌కు ఆదాయం కూడా పెరుగుతుందని బడేటి బుజ్జి చెప్పారు. ఏలూరు నగరంలో ఫైర్ స్టేషన్, క్రొత్త బస్టాండ్, పాతబస్టాండ్, వసంతమహాల్ సెంటర్, రమామహల్ సెంటర్, తంగెళ్లమూడి, చింతలపూడి రోడ్, కైకలూరు రోడ్ తదితర ప్రధాన సెంటర్లలో కార్పోరేషన్‌కు రుసుం చెల్లించి అవసరమైన ప్రకటనలు పొందే విధంగా ఆయా ప్రాంతాలలో పెద్ద ప్రచార బోర్డులు నెలకొల్పుతామని అక్కడ డిస్ప్లే చేసే వాటికి ఖచ్చితంగా కార్పోరేషన్‌కు తగిన రుసుం చెల్లించాల్సి ఉంటుందని దీనివలన అటు ఒకక్రమపద్ధతిలో ప్రచారబోర్డులుంటాయని ఇటు కార్పోరేషన్‌కు ఆదాయ వనరులు పెరుగుతాయని బడేటి బుజ్జి చెప్పారు. ప్రభుత్వ పధకాలపై ఉచితంగా ప్రచారం కల్పించే అవకాశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఏలూరు నగరంలో ఎవరిష్టానుసారం వారు ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయకుండా ఇకపై మూడు రోజులు వరకూ ఉచితం, ఆ తర్వాత సొమ్ము వ సూలు చేసే నూతన విధానాన్ని పటిష్టవం తంగా అమలు చేస్తామని ఈ ప్రచార బోర్డులలో ప్రచారం కావాల్సినవారు పది రోజులు ముందుగానే కార్పోరేషన్లో నమోదు చేయించుకోవాలని బడేటి బుజ్జి కోరారు.
శాంతియుతంగా వినాయకచవితి వేడుకలు: ఎమ్మెల్యే బుజ్జి
ఏలూరు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ప్రపంచవ్యాప్తంగా వినాయకచవితి వేఢుకలు కన్నులపండుగగా జరుపుకోవడం గర్వకారణమని ఏలూరు శాసనసభ్యులు బడేటి బుజ్జి చెప్పారు. ఏలూరు నగరంలో పవరుపేట, అశోక్‌నగర్, చాణుక్యపురికాలనీ, మినీ బైపాస్ రోడ్‌లోని రామకృష్ణాపురం, పేరయ్యకోనేరులలోని భారీ గణనాధుని విగ్రహాలను మంగళవారం దర్శించి బడేటి బుజ్జి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతాలు వేరైనా, కులాలు వేరైనా ప్రపంచమంతా వినాయకుడిని పూజించడం అనాదినుండి జరుగుతోందని ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నాలు తొలగించి మంచిని చేయమని ప్రపంచమంతా వినాయకుడికి ప్రత్యేక పూజలు జరపడం గొప్ప విషయమని బడేటి బుజ్జి చెప్పారు. తాను ఇటీవల పలు దేశాలలో పర్యటించానని ఎక్కడకు వెళ్లినా భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ఆరాధించడం చూసానని బడేటి బుజ్జి చెప్పారు. తెలుగునాట ప్రతీ ఒక్కరూ వినాయకచవితి వేడుకల్లో పాల్గొని ఘనంగా పూజించడం ఇంటింటా ఒక పండుగ వాతావరణం నెలకొంటుందని చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలు వాడవాడలా జరుపుతున్నామని గతంతో పోలిస్తే అడుగడుగునా ప్రజలు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించేవారి సంఖ్య పెరుగుతోందని బుజ్జి చెప్పారు. వినాయకచవితి సందర్భంగా ఏలూరు నగరంలో 70 కు పైగా భారీ విగ్రహాలు ఏర్పాటుచేసి ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు జరుపుతున్నారని ఈఏడాది ఏలూరు నగరం మరింత అభివృద్ధి సాధించేలా గణపతి ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని కోరారు. పేరయ్యకోనేరులో ఏర్పాటుచేసిన భారీ వినాయకవిగ్రహ కమిటీ సభ్యులు బడేటి బుజ్జిని, శాసనమండలి సభ్యులు రాము సూర్యారావును ఘనంగా సత్కరించారు.


