సుధీర్ బాబు నిర్మించిన ‘నన్ను దోచుకుందువటే’ తొలి రోజున హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయింది. తర్వాత అయినా పుంజుకుంటుందని చూస్తే శనివారం కూడా వసూళ్లలో ఎలాంటి బెటర్మెంట్ కనిపించలేదు. ఆదివారం కూడా వసూళ్ల ట్రెండింగ్ వీక్‌గానే వుంది. దీంతో ఈ చిత్రం ఫ్లాప్ అని ట్రేడ్ తేల్చేసింది.
గత వారం విడుదలైన ‘శైలజారెడ్డి అల్లుడు’ మొదటి వీకెండ్ తర్వాత డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. సెకండ్ వీకెండ్లో కూడా కలక్షన్లు ఇంప్రూవ్ అవలేదు. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడం అసాధ్యమని తేలిపోయింది. ఫైనల్‌గా కమర్షియల్ రేంజ్ పరంగా యావరేజ్‌తో సరిపెట్టుకుంటుంది. సమంత నటించిన ‘యూ టర్న్’ చిత్రానికి ఇంకా వసూళ్లయితే వస్తున్నాయి కానీ ఇది కూడా యావరేజ్ మార్కుని దాటలేదని ట్రేడ్ చెబుతోంది. విక్రమ్ నటించిన ‘సామి’ చిత్రం కూడా డిజాస్టర్ దిశగా పయనిస్తోంది.
‘గీత గోవిందం’ నైజాంలో ఇరవై కోట్లకి పైగా షేర్ సాధించి అరుదైన రికార్డుని అందుకుంది. మధ్య శ్రేణి చిత్రాల్లో మహానటి, ఫిదా చిత్రాలని దాటి పెద్ద సినిమాలకి మాత్రమే చెందిన ఇరవై కోట్ల రికార్డుని చేరుకోగలిగింది.