ఏపీలో ఫిర్యాదు చేసినవాళ్లపైనే ఉల్టా కేసులు

 

ఫిర్యాదు చేసినవాళ్లపైనే ఉల్టా కేసులు పెడుతోన్న వైనం ఏపీలో కొనసాగుతోందని ఆరోపించారు వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు. వాస్తవం ఇలా ఉంటే, కేంద్రం మాత్రం ఏపీ పోలీసులకు భారీ ఎత్తున అవార్డులు ఇస్తూ పోతున్నది. కేంద్ర అవార్డులతోపాటు ఏపీ ప్రజల హదయాలను కూడా గెలుచు కోవాలని పోలీసులను కోరుతున్నాను. పోలీసులు కోరితే అన్ని వివరాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గతంలో నేను ఇచ్చిన ఫిర్యాదులపై ఏపీ పోలీసులు సరిగా స్పందించలేదు. అంతెందుకు, కోర్టు ఆదేశించిన తర్వాత కూడా అరెస్టులు చేయ లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించొచ్చు. ఓ సీనియర్‌ జర్నలిస్టును నంబర్‌ లేని లారీతో గుద్ది చంపుతామని మల్యాద్రి రెడ్డి అనే వ్యక్తి బెదిరింపులకు దిగాడు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు అనుచరుడిగా చెప్పుకునే ఈ మాల్యాద్రిపై నేను కూడా గతంలో ఫిర్యాదు చేశాను. లారీతో గుద్దితేనో, ఇంకేదో చేస్తేనే భరించ డానికి మేం వారికి బంధువులం లేదా బాబాయిలం కాదు. ఇప్పుడా బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేయడానికి కూడా భయపడుతున్నాడని ఎంపీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *