ఇమ్రాన్‌ఖాన్‌ డ్రగ్‌ అడిక్ట్‌

 

పాకిస్థాన్‌ ప్రధాని, మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ తీసుకొని ఆడాడు అనడానికి తానొక్కన్నే సాక్ష్యం కాదని, లండన్‌లో చాలా మందికి అతనో డ్రగ్‌ అడిక్ట్‌ అని తెలుసున్నాడు మాజీ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ నవాజ్‌. 1987 ఇంగ్లండ్‌ పర్యటనలో సరిగ్గా బౌలింగ్‌ చేయలేకపోయిన ఇమ్రాన్‌ డ్రగ్స్‌ తీసుకొని బరిలోకి దిగాడని ఈ పాక్‌ మాజీ క్రికెటర్‌ గుర్తు చేసుకున్నాడు. ఓసారి తన ఇంటికి వచ్చినప్పుడు కూడా భోజనంతో పాటు మత్తుపదర్థాలు తీసుకున్నాడని తెలిపాడు. తన ముందు నిలబెట్టి అడిగితే ఇమ్రాన్‌ ఖాన్‌ను కూడా డ్రగ్స్‌ తీసుకున్న విషయాన్ని ఖండించలేడని తెలిపాడు. మోహ్‌సిన్‌ ఖాన్‌, అబ్దుల్‌ ఖాదిర్‌, సాలిమ్‌ మాలిక్‌తో మా ఇంటికి వచ్చినప్పుడు భోజనంతో కలిపి డ్రగ్స్‌ తీసుకున్నాడు’అని సర్ఫరాజ్‌ నవాజ్‌ చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్‌కు 1992లో ప్రపంచకప్‌ అందించిన ఇమ్రాన్‌ ఖాన్‌.. టెస్ట్‌ల్లో 362, వన్డేల్లో 182 వికెట్లు తీశాడు. ఇక ఈ వ్యాఖ్యలు పాక్‌ క్రికెట్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *