టీమిండియాకు తప్పిన పెద్ద ప్రమాదం

 

ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లిన టీమిండియా బస చేసిన హోటల్‌ సమీపంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన కోహ్లీసేనను ఉలిక్కిపడేలా చేసింది. భయాందోళనలకు గురి చేసింది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు.. ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం బయలుదేరి వెళ్లింది. క్రికెటర్లు, హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, సపోర్టింగ్‌ స్టాఫ్‌ మొత్తం ప్రస్తుతం సిడ్నీలో ఉంటోంది. సిడ్నీ ఒలింపిక్‌ పార్క్‌ హోటల్‌లో బస చేసింది. బయో సెక్యూర్‌ బబుల్‌లో భాగంగా టీమిండియా అక్కడే క్వారంటైన్‌ కాలాన్ని గడుపుతోంది. సిడ్నీలోని క్రోమర్‌ పార్క్‌ స్టేడియం సమీపంలో ఓ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కుప్పకూలింది. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. మిడ్‌ ఎయిర్‌లో ఈ తేలికపాటి విమానం ఇంజిన్‌ ఒక్కసారిగా స్తంభించిపోవడంతో ప్రమాదానికి కారణమైంది. ఇంజిన్‌ నిలిచిపోవడంతో ఈ విమానం కుప్పకూలింది. క్రోమర్‌ పార్క్‌ స్టేడియానికి అతి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో స్టేడియంలో స్థానిక క్రికెటర్లు, ఫుట్‌బాల్‌ ప్లేయర్లు మ్యాచ్‌లను ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించారు.ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశం.. సిడ్నీ ఒలింపిక్‌ పార్క్‌ హోటల్‌కు 30 మీటర్ల దూరంలో ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *