అచ్చెన్నాయుడ్ని అవమానిస్తున్న చంద్రబాబు

 

టీడీపీ అధ్యక్ష పదవి అబ్బాయికిస్తారని ఊరించి బాబాయి అచ్చెన్నను అధ్యక్షుడిగా అపాయింట్‌ చేసినప్పుడే దాని విలువ ఏపాటిదో అందరికీ తెలిసిపోయింది వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి ట్వీట్‌ చేశారు. ఇప్పుడు అధ్యక్ష ప్రమాణానికి రానని బాబు చీదరించుకోవడం.. కనీసం పార్టీ ఆఫీసులో ప్రోగ్రాం పెట్టుకోవడానికి నో చెప్పడం బీసీలను అవహేళన చేయడం కాదా విజనరీ అంటూ ట్వీట్‌ చేశారు. టీడీపీ అధ్యక్ష పదవిని ఎంపీ రామ్మోహన్‌ నాయుడికి ఇస్తానని చెప్పి చంద్రబాబు మాట మార్చారని విజయసాయిరెడ్డి అంటున్నారు. టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి చంద్రబాబు అడ్డంకులు సష్టిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రావడం కుదరదని చంద్రబాబు చెప్పారని.. అంతేకాదు పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా ఒప్పుకోలేదని మీడియాలో కూడా వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి చంద్రబాబు, టీడీపీని టార్గెట్‌ చేశారు. అచ్చెన్నాయుడికి ఆ పదవి దక్కాల్సింది కాదన్నారు. చంద్రబాబు మోసం చేశారంటూ పరోక్షంగా ప్రస్తావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *