మెగా అల్లుడికి రూ. 10 కోట్లు కట్నం ?

 

మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు, నిహారిక వివాహం వచ్చే నెలలో జరగబోతుంది. ఇప్పటికే పెళ్లి పనుల్లో మెగా ఫ్యామిలీ చాలా బిజీగా ఉంది. కాగా ఈ వివాహం రాజస్తాన్‌లో జరపనున్నారు. డిసెంబర్‌ 9వ తేదీ రాత్రి 7.15 గంటలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో నిబంధనలను పాటిస్తూ కుటుంబసభ్యులు, బంధుమిత్రులను మాత్రమే ఈ వివాహానికి ఆహ్వానం పలికారట. కాగా మెగా బ్రదర్‌ కాబోయే అల్లుడికి ఎంత కట్నం ఇస్తున్నాడనే దానిమీద చాలా చర్చ జరుగుతోంది. టాలీవుడ్లో అనుకుంటున్న ప్రకారం సుమారు రూ.10కోట్ల వరకు లాంఛనాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లి కూతురు నిహారిక నగల కోసం మరో రూ.2 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు నిహారిక పేరు మీద ఉన్న బంగ్లాను కూడా అల్లుడికే ఇచ్చేస్తున్నారట. సో తనకున్న దాంట్లో కూతురికి భారీ స్థాయిలో నాగబాబు పెళ్లి చేస్తున్నాడు అనుకుంటున్నారు సినీ జనాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *