కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో నలుగురు టెర్రరిస్టుల హతం

 

కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్‌, జమ్మూ కశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపడుతున్నాయి. గురువారం ఉదయం జమ్మూ నుంచి శ్రీనగర్‌కు ఉగ్రవాదులు బస్సులో వెళుతుండగా నగరోటా జిల్లా వద్ద సైన్యం నిర్బంధ తనిఖీలు చేపట్టింది. బాన్‌ టోల్‌ ప్లాజా వద్ద జాతీయ రహదారిని మూసివేసి తనిఖీలు చేస్తుండగా జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌ గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో నగ్రోటా చెక్‌పోస్ట్‌ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *