ఆ దేశంలో రేప్‌ చేస్తే నపుంసకులుగా మార్చేస్తారు

 

పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సుల్లో ఓ మహిళపై ఆమె పిల్లల ముందే కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సెప్టెంబరులో చోటుచేసుకోవడంతో దీనిపై తీవ్రంగా స్పందించిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. ఇటువంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టం తీసుకురావాలని న్యాయశాఖకు సూచించారు. అలాగే, సింధ్‌ ప్రావిన్సుల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఓ మహిళ, ఆమె కుమార్తెపై గ్యాంగ్‌ రేప్‌నకు పాల్పడిన ఘటనపై ప్రధాని తీవ్రంగా కలతచెందారని మంత్రి ఫరాజ్‌ అన్నారు. దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రధాని.. నిందితులను కఠినంగా శిక్షించాలంటే త్వరగా కొత్త చట్టం తీసుకురావాలని ఆదేశించారన్నారు. అత్యాచారం కేసులో నిందితులను రసాయనాల ద్వారా నంపుసకులుగా మార్చే ఆర్డినెన్స్‌ చట్టం రూపం దాల్చితే ఇండోనేషియా, పోలెండ్‌, రష్యా, ఎస్తోనియా వంటి దేశాల సరసన పాక్‌ చేరుతుంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలను అరికట్టేందుకు పాకిస్థాన్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోడానికి వీలుగా త్వరలోనే కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. అత్యాచారానికి పాల్పడినవారిని రసాయనాల సహాయంతో నపుంసకులుగా మార్చేందుకు వీలు కల్పించే నూతన చట్టానికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు ఓ పాక్‌ పత్రిక వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *